అక్షరటుడే, వెబ్డెస్క్ : Digvijaya Singh | కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ (Digvijay Singh) ఆర్ఎస్ఎస్ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీంతో హస్తం పార్టీలో కలవరం మొదలైంది.
కాంగ్రెస్ సైద్ధాంతికంగా వ్యతిరేకిస్తున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) (Rashtriya Swayamsevak Sangh) సంస్థాగత బలాన్ని దిగ్విజయ్ సింగ్ ప్రశంసించడం కలకలం సృష్టించింది. ఎల్కే అద్వానీతో మోదీ కూర్చున్న ఫొటోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో అద్వానీ కూర్చిలో కూర్చోగా ప్రధాని మోదీ (Prime Minister Modi) ఆయన కాళ్ల దగ్గర నేలపై కూర్చొని ఉన్నారు. ఈ ఫొటోను పోస్ట్ చేసిన దిగ్విజయ్ సింగ్ ఆరెస్సెస్ సంస్థలో నాయకత్వాన్ని ఎలా తీర్చిదిద్దుతుందో సింగ్ అంగీకరించారు. ఆరెస్సెస్, జనసంఘ్ నుంచి ఒక సామాన్య కార్యకర్త దేశ ప్రధానిగా ఎలా ఎదిగారో చెప్పడానికి ఈ చిత్రం ఉదాహరణగా నిలుస్తుందన్నారు. “ఈ ఫొటోను నేను కోరా సైట్లో చూశాను. ఇది చాలా ఆకట్టుకునేలా ఉంది. ఒక ఆరెస్సెస్ సామాన్య స్వయంసేవక్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా ఎలా ఎదిగారు. ఇదే ఆ సంస్థ శక్తి.” అని పేర్కొన్నారు.
Digvijaya Singh | కాంగ్రెస్లో వారిదే అధికారం
బీజేపీలో సామాన్య కార్యకర్త పార్టీ అధ్యక్షుడు కావొచ్చు. దేశ ప్రధాని కూడా కావొచ్చు. కానీ కాంగ్రెస్లో ఆ పరిస్థితి లేదు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి దాదాపుగా ఆ పార్టీ నెహ్రు–గాంధీ కుటుంబం (Nehru-Gandhi family) చేతిలోనే ఉంది. వారు చెప్పిందే జరుగుతుంది. సామాన్య కార్యకర్తలు పార్టీ అధ్యక్షులు కాలేరు. అలాగే ప్రధాని పదవికి కూడా గాంధీ–నెహ్రూ కుటుంబంలోని వారే పోటీగా ఉంటారు. లేదంటే వారు చెప్పినట్లు వినే నాయకుడికి బాధ్యతలు అప్పగిస్తారు. ఇటీవల జాతీయ అధ్యక్షుడి కోసం ఖర్గేకు పోటీ శశిథరూర్ రాగా.. సోనియా, రాహుల్ తాము చెప్పినట్లు వినే ఖర్గేకు పగ్గాలు అప్పగించారు. ఈ క్రమంలో దిగ్విజయ్ సింగ్ పోస్టుపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగింది. ఆయన కాంగ్రెస్లో కుటుంబ పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ పోస్టు చేసినట్లు బీజేపీ నాయకులు పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్లో కలవరం మొదలైంది. ఇప్పటికే ఆ పార్టీ నేత శశిథరూర్ బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో మరో సీనియర్ నాయకుడు సైతం కమలం దారిలోకి వెళ్తారా అన్న చర్చ మొదలైంది.
Digvijaya Singh | వివరణ ఇచ్చిన దిగ్విజయ్
తన పోస్టుపై దుమారం రేగడంతో దిగ్విజయ్ సింగ్ వివరణ ఇచ్చారు. తాను సంస్థకు మద్దతు ఇచ్చానని చెప్పారు. అయితే ఆరెస్సెస్, మోదీకి తాను వ్యతిరేకినని స్పష్టం చేశారు. తాను ‘సంస్థను’ ప్రశంసించానని చెప్పారు. కాగా దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్లో సీనియర్ నాయకుడు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన గతంలో మధ్య ప్రదేశ్ సీఎంగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. తాను ఆర్ఎస్ఎస్లో సంస్థగత నిర్మాణం గురించి మాట్లాడనని ఆయన చెప్పారు. సైద్ధాంతికంగా ఆ సంస్థను తాను వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు.