అక్షరటుడే, వెబ్డెస్క్: Digi Lakshmi Scheme | ప్రభుత్వాలు ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. మహిళలు, వృద్ధులు, రైతులు, విద్యార్థులు ఇలా అన్ని రంగాల వారిని దృష్టిలో పెట్టుకుని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. అన్ని అర్హతలూ ఉండి, పత్రాలు సరిగా ఉంటే ప్రభుత్వం అందించే లబ్ధిని పొందే అవకాశం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Government) ప్రజలకు ప్రభుత్వ, ప్రైవేట్ డిజిటల్ సేవలను(Digital seva) వేగంగా అందించేందుకు “డిజిటల్ లక్ష్మి(డిజీ లక్ష్మీ)” పేరిట వినూత్న పథకాన్ని ప్రవేశపెడుతోంది. ఈ స్కీం ద్వారా పట్టణ ప్రాంతాల్లో డ్వాక్రా సంఘాల్లోని విద్యావంతులైన మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, ప్రజలకు మౌలిక డిజిటల్ సేవలు ఇంటి వద్దే అందించేందుకు డిజిటల్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
Digi Lakshmi Scheme | లక్ష్యం ఏంటి?
దీని లక్ష్యం ఏమిటంటే.. మధ్యవర్తుల జోక్యం లేకుండా ప్రభుత్వ పథకాలను ప్రజలకు నేరుగా అందించడం, డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం, డిజిటల్ ఇండియా(Digital India)లో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రజలకు డిజిటల్ సేవలను మరింత సులభతరంగా మార్చడమని చెబుతున్నారు. పథకం తుది రూపురేఖలపై ప్రభుత్వం చురుకుగా కసరత్తు చేస్తోంది. జూన్ 12న అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉందని పట్టణ పేదరిక నిర్మూలన మిషన్(మెప్మా) అదనపు ఎండీ కె.వెంకటేశ్వరరావు తెలిపారు. దీనికి ఎవరెవరు అర్హులు అంటే.. వయస్సు: 21 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి, విద్యార్హత కనీసం డిగ్రీ(Degree) పూర్తిచేసి ఉండాలి. వారికి కంప్యూటర్ జ్ఞానం(Computer Knowledge) కలిగి ఉండాలి. అభ్యర్థుల ఎంపిక స్థానిక అధికారుల ద్వారా వారి అర్హతల ఆధారంగా జరుగుతుంది.
సేవా కేంద్రాల ఏర్పాటు ఎలా ఉంటుందనే అనుమానాలు అందరిలో ఉన్నాయి. అందుకుగాను మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి 250 ఇళ్లకు ఒక కేంద్రం ఉండేలా ప్రణాళిక. డ్వాక్రా మహిళలు(Dwakra Women) తమ ఇంటి దగ్గర చిన్న స్థలంలో సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ కేంద్రాల ఏర్పాటుకు కావాల్సిన సుమారు రూ. 2 లక్షల వరకు రుణం మెప్మా ద్వారా బ్యాంకుల(Banks) నుంచి ఇప్పించనున్నారు. ఇందులో పింఛన్, రేషన్ కార్డు, హెల్త్ కార్డు, రైతు భరోసా(Raithu Bharosa) వంటి సేవలు లభిస్తాయి. ఆధార్ అప్‌డేట్, పాన్ కార్డు అప్లికేషన్, బ్యాంక్ రుణాలు, డిపాజిట్లు, బీమా సేవలు కూడా ఉంటాయి. బస్సు/రైలు టికెట్లు, ఇ-మొబిలిటీ సౌకర్యాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారం & దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి కేంద్రానికి నెలకు కనీసం రూ. 30,000 వరకు ఆదాయం వచ్చే అవకాశముందని అంచనా.