ePaper
More
    HomeతెలంగాణWarangal Congress | వరంగల్​ కాంగ్రెస్​లో విభేదాలు.. కొండా మురళి వ్యాఖ్యలపై నేతల ఆగ్రహం

    Warangal Congress | వరంగల్​ కాంగ్రెస్​లో విభేదాలు.. కొండా మురళి వ్యాఖ్యలపై నేతల ఆగ్రహం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Warangal Congress | ఉమ్మడి వరంగల్​ జిల్లా కాంగ్రెస్​లో విభేదాలు ముదిరాయి. మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి(Konda Murali) గురువారం సొంత పార్టీనేతలపైనే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్​ నేతలు(Congress leaders) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యేలు కీలక సమావేశం నిర్వహించారు.

    కొండా మురళి గురువారం మాట్లాడుతూ.. స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari), పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాశ్​రెడ్డి(Parakala MLA Revuri Prakash Reddy)పై వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు పదవికి రాజీనామా చేయాలని కడియంను ఉద్దేశించి అన్నారు. అంతేగాకుండా కడియం టీడీపీని భ్రష్టు పట్టించారని, కేసీఆర్​కు వెన్నుపోటు పొడిచారని అన్నారు. రేవురి ప్రకాశ్​రెడ్డి ఎన్నికల ముందు తన కాళ్లు పట్టుకున్నారని కొండా మురళి వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఆగ్రహంగా ఉన్నారు.

    READ ALSO  BC girls hostel | బీసీ బాలికలపై హాస్టల్​ సిబ్బంది టార్చర్​.. వార్డెన్​ కొడుకు లైంగిక వేధింపులు!

    Warangal Congress | నాయిని క్యాంప్​ కార్యాలయంలో సమావేశం

    కొండా మురళి చేసిన సంచలన వ్యాఖ్యలతో వరంగల్​ రాజకీయాల్లో కలకలం రేగింది. ఈ క్రమంలో వరంగల్‌ వెస్ట్‌ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి క్యాంప్‌ ఆఫీసులో శుక్రవారం పలువురు నేతలు సమావేశం అయ్యారు. ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్‌రెడ్డి, కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, నాయకులు ఎర్రబెల్లి స్వర్ణ, సుధారాణి, గండ్ర సత్యనారాయణ, నాగరాజు హాజరయ్యారు. మురళి వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే(Congress MLA)లు, నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండా దంపతులకు వ్యతిరేకంగా నేతలు ఏకం అవుతున్నారు. ఈ క్రమంలో నాయిని క్యాంప్​ ఆఫీస్​(Naini Camp Office)లో భేటీ అయ్యారు. మురళి వ్యాఖ్యలపై అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.

    Latest articles

    Maoists | భారీగా లొంగిపోయిన మావోయిస్టులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Maoists | కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్​ కగార్​తో (Operation Kagar) కలవరపడుతున్న మావోయిస్టులను లొంగుబాట్లు...

    Fertilizers | రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలి

    అక్షరటుడే, భీమ్​గల్​: Fertilizers | రైతులకు ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాలని డీపీవో(DPO Srinivas rao), మండల ప్రత్యేకాధికారి...

    Kamareddy MLA | సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy MLA | సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణలక్ష్మి చెక్కులను కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట...

    BJP Kisan Morcha | రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

    అక్షరటుడే, కామారెడ్డి: BJP Kisan Morcha | కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో నెరవేర్చాలని బీజేపీ...

    More like this