అక్షరటుడే, ఇందూరు: Nizamabad city | ఓ వృద్ధురాలు బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోయినా.. ఇద్దరికి నేత్రదానం చేసింది. ఈ ఘటన నగరంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని శ్రీనగర్ కాలనీకి (Srinagar Colony) చెందిన కరిపే సావిత్రి బాయి అనే వృద్ధురాలు బ్రెయిన్ స్ట్రోక్తో (Brain stroke) మృతి చెందారు.
దీంతో విషయం తెలిసిన లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూరు సభ్యులు ఆమె కుమారుడైన బీసీ ఉద్యోగుల సంఘం (BC Employees Association) జిల్లా అధ్యక్షుడు కరిపే రవీందర్తో పాటు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నేత్రదానంపై (Eye donation) అవగాహన కల్పించడంతో వారు అంగీకరించారు.
దీంతో మృతురాలి నుంచి సేకరించిన నేత్రాలను లయన్స్ ఐ హాస్పిటల్కు (Lions Eye Hospital) అందజేసినట్లు జిల్లా లయన్స్ అదనపు కార్యదర్శి లక్ష్మీ నారాయణ తెలిపారు. ఆమె నేత్ర దానంతో ఇద్దరికి కంటి వెలుగు వచ్చిందని, ఈ మేరకు సహరించిన కరిపే రవీందర్ కుటుంబ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో కరిపే గోవర్ధన్, లింగోజీ, డా తేజస్వి, డా రాజేష్, అక్షయ్ కుమార్, పుష్ప, విజయలక్ష్మి పాల్గొన్నారు.