- Advertisement -
Homeతాజావార్తలుMla Prashanth Reddy | జీఎస్టీ పేరుతో ప్రజలపై భారం మోపింది బీజేపీ కాదా..? :...

Mla Prashanth Reddy | జీఎస్టీ పేరుతో ప్రజలపై భారం మోపింది బీజేపీ కాదా..? : ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి ధ్వజం

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Mla Prashanth Reddy | కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక జీఎస్టీ (GST) పేరుతో లేని భారాన్ని ప్రజలపై మోపింది నిజమా..? కాదా..? అని ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి (MLA Prashanth Reddy) ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. జీఎస్టీని తగ్గించామని చెబుతూ దేశవ్యాప్తంగా బీజేపీ డబ్బాలు కొట్టుకుంటోందని.. అసలు జీఎస్టీ పేరుతో ప్రజలపై భారం ఎవరు వేయమన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Mla Prashanth Reddy | జీఎస్టీ పేరుతో ప్రజల నుంచి దోపిడీ..

ఈ ఏడాది జీఎస్టీ పేరుతో దేశ ప్రజల నుంచి రూ. 22 లక్షల కోట్లను దోచుకున్నారని ప్రశాంత్​ రెడ్డి అన్నారు. తాజాగా దాంట్లో నుంచి రూ. 2 లక్షల కోట్లు తగ్గించి ఏదో మెహర్బానీ చేసినట్లు చెప్పుకోవడం బీజేపీకే చెల్లిందన్నారు. తొమ్మిదేళ్లలో జీఎస్టీ పేరుతో ప్రజల నుంచి బలవంతంగా రూ. 100 లక్షల కోట్లు దోచుకుని ఇప్పుడు కొంతమేర తగ్గించి దసరా కానుక (Dussehra gift) అంటూ కేంద్రం ప్రజలను మభ్యపెడుతోందని మండిపడ్డారు.

- Advertisement -

Mla Prashanth Reddy | ఎంపీ అర్వింద్​కు సవాల్​..

ఎంపీ అర్వింద్​ (MP Arvind) మంగళవారం జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ.. తెలంగాణలోని ప్రతి వ్యక్తికి నెలకు రూ. 5వేలు మిగిల్చామని చెప్పారని.. అంటే గడిచిన తొమ్మిదేళ్లుగా జీఎస్టీ పేరుతో తెలంగాణలో ప్రతివ్యక్తి నుంచి రూ.5వేల చొప్పున మొత్తం రూ. 5,40,000 కోట్లు బీజేపీ దోచుకున్నట్టేనని ఆయన విమర్శించారు. దీనికి సమాధానం చెప్పాలని ఎంపీ అర్వింద్​కు సవాల్​ విసిరారు.

మరో బీజేపీ ఎంపీ రఘునంద్​రావు (BJP MP Raghunand Rao) మాట్లాడుతూ.. ఇప్పుడు జీఎస్టీ తగ్గించడం ద్వారా ప్రతి కుటుంబానికి నెలకు రూ.15,000 మిగిల్చామని అంటున్నారని.. అంటే.. గడిచిన తొమ్మిదేళ్లుగా ఒక్కో కుటుంబం నుంచి నెలకు రూ. 15,000 దోచుకున్నట్లే కాదా అని ప్రశాంత్​రెడ్డి వ్యాఖ్యానించారు. అసలు ఎంపీలకు మెదడు ఉండి మాట్లాడుతున్నారా.. అని ప్రశ్నించారు.

Mla Prashanth Reddy | కేంద్రాన్ని జీఎస్టీ ఎవరు అమలు చేయమన్నారు..?

కేంద్రాన్ని జీఎస్టీ ఎవరు అమలు చేయమన్నారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. 2017 నుంచి కొత్తగా జీఎస్టీ పెట్టి పప్పు, ఉప్పు, సబ్బు, నూనె, షర్ట్, టీవీ, బైక్​లు, కార్లు ఇలా అన్నిరకాల వస్తువుల ధరలు పెంచి ప్రజలను పీడించింది మీ బీజేపీ ప్రభుత్వం కాదా? అని వ్యాఖ్యానించారు. ఇంకా ఎన్ని రోజులు ఇలా మాయమాటలతో ప్రజలను మోసం చేస్తారన్నారు. ఈ తతంగాన్ని పూర్తిగా గమనిస్తున్న ప్రజలు ఓట్ల సమయంలోనే బీజేపీకి బుద్ధి చెబుతారని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News