ePaper
More
    HomeసినిమాKubera Trailer | కుబేర ట్రైలర్ అంచ‌నాలు పెంచిందా.. రాజ‌మౌళి రియాక్ష‌న్ ఏంటి?

    Kubera Trailer | కుబేర ట్రైలర్ అంచ‌నాలు పెంచిందా.. రాజ‌మౌళి రియాక్ష‌న్ ఏంటి?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Kubera Trailer | నాగార్జున (Nagarjuna), ధనుష్ (Dhanush), రష్మిక మందన్న(Rashmika) ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెలుగు సెన్సిబుల్ డైరెక్ట‌ర్‌ శేఖర్‌ కమ్ముల మొద‌టిసారిగా తెర‌కెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘కుబేర’ (Kuberaa). సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మాతలు. రాక్‌స్టార్ దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం స‌మ‌కూర్చాడు. ఈ మూవీని జూన్ 20న విడుద‌ల చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలో కొద్ది రోజులుగా మూవీకి సంబంధించి ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు జోరుగా సాగుతున్నాయి. గ‌త రాత్రి హైద‌రాబాద్‌లో జ‌రిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా రాజ‌మౌళి హాజ‌రు కాగా.. ఆయ‌న చేతుల మీదుగా ట్రైల‌ర్ విడుద‌లైంది.

    Kubera Trailer | ఇంట్రెస్టింగ్ ట్రైల‌ర్

    డబ్బు, పవర్‌ చుట్టూ సినిమా తిరుగుతుందని, దానికోసమే ప్రధాన పాత్రల మధ్య సంఘర్షణ అని ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. ఇందులో కోట్లు కోట్లు కోట్లు అంటే ఎంత సార్‌ అని ధనుష్‌ చెప్పడం, ఆయిల్‌ అంటే సాధారణ విషయం కాదు, మనందరి తొక్క తీసి పదవి నుంచి తీసేసే పవర్‌ ఫుల్‌ మిషన్‌ అని విలన్లు మాట్లాడుకోవడం, ఈ దేశంలో డబ్బు, పవరే పని చేస్తాయి, నీతి న్యాయాలు కాదు, ఇది చరిత్ర అని నాగార్జున చెప్పడం, ఆయన్ని పోలీసులు తీసుకెళ్లడం వంటివి ట్రైలర్‌(Trailer)లో ఆసక్తికరంగా సాగాయి. అనంతరం `వాళ్ల మీద చేయి వేయడానికి లేదు అని, నా పేరు దీపక్ అని ధనుష్‌ని నాగార్జున పరిచయం చేసుకోవడం, బిచ్చగాడిని తీసుకొచ్చి పెద్ద ప్యాలెస్‌లో ఉంచి రాజభోగాలు కల్పించడం, ఆ తర్వాత అమ్మ అమ్మ అంటూ ధనుష్‌.. రష్మిక వెంట పడడం, ఆమె ఎందుకురా నా వెంట పడుతున్నావని చెప్పడం, అనంతరం ధనుష్‌ గాయాల పాలు కావడం, మీరు తప్ప నాకు ఎవరూ తెలియదు మేడం అని ఆయన చెప్పడం ఆసక్తికరంగా అనిపించింది.

    ట్రైల‌ర్ చూశాక ప్ర‌శంస‌ల వర్షం కురిపించాడు రాజ‌మౌళి. శేఖర్ నమ్మిన సిద్ధాంతాల మీద సినిమాలు తీస్తారు. నేను నమ్మిన సిద్ధాంతాలకు, చేసే సినిమాలకు సంబంధం ఉండదు. ఆయన నాకు జూనియర్ అనుకున్నాను కానీ నాకంటే వన్ ఇయర్ సీనియర్. ఈ 25 సంవత్సరాల్లో అలాగే ఉన్నాడు. నాగార్జున గారు, శేఖర్ కమ్ముల, టైటిల్ కుబేర అని ఈ ప్రాజెక్ట్ వచ్చిన వెంటనే ఫెంటాస్టిక్ గా అనిపించింది. ధనుష్ కూడా ఇందులో ఉన్నారని తెలిసిన తర్వాత అద్భుతమైన కాంబినేషన్ అనిపించింది. ట్రాన్స్ అఫ్ కుబేర రిలీజ్ అయిన తర్వాత మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఒక రిచ్ ప్రపంచంలో నాగార్జున, పూర్ ప్రపంచంలో ధనుష్.. సినిమా కథ గురించి ఏమి చెప్పకుండా ఈ రెండు క్యారెక్టర్స్​ను చూపించడం చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. శేఖర్ కమ్ముల(Shekhar Kammula) తన సినిమాను ట్రైలర్​లోనే చెప్పేస్తారు. కానీ కుబేర విషయానికి వస్తే ఒక సస్పెన్స్ సినిమా లాగా అనిపిస్తుంది. ట్రైలర్ ఆసక్తిని మరింత పెంచింది. మైండ్ బ్లోయింగ్ విజువల్స్. ప్రొడక్షన్ డిజైన్ అద్భుతంగా ఉంది. జూన్ 20. డోంట్ మిస్ కుబేర` అని అన్నారు రాజమౌళి.

    More like this

    Shobha Yatra | శోభాయాత్ర ప్రారంభం.. గట్టి బందోబస్తు.. కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణ

    అక్షరటుడే, కామారెడ్డి : Shobha Yatra : కామారెడ్డి పట్టణంలో గణేష్ శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. ఆనవాయితీ ప్రకారం...

    Betting app case | బెట్టింగ్ యాప్​ వేధింపులకు మరో యువకుడు బలి

    అక్షరటుడే, కామారెడ్డి : Betting app case | ఆన్​లైన్​ బెట్టింగ్ జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. ఈజీగా డబ్బు...

    GPO | రెవెన్యూశాఖపై అవినీతి ముద్రను తొలగించే బాధ్యత జీపీవోలదే : సీఎం రేవంత్​

    అక్షరటుడే, హైదరాబాద్: GPO | అవినీతికి పాల్పడుతారని సమాజం ముందు దోషిగా రెవెన్యూ శాఖ మీద పడిన ముద్రను...