అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kriti sanon | టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్‌లు అనౌన్స్ చేసిన వెంటనే భారీ అంచనాలు క్రియేట్ అవుతాయి. అలాంటి సంచలన కాంబినేషన్‌లలో మహేష్ బాబు–సుకుమార్ (Mahesh Babu -Sukumar) దర్శకత్వం వహించిన ‘నేనొక్కడినే’ ఒకటి.
సినిమాను ప్రకటించిన క్షణం నుంచే భారీ హైప్ నెలకొంది. మహేష్ బాబు లుక్, సిక్స్‌ప్యాక్ ట్రాన్స్‌ఫార్మేషన్ వార్తలు ఆ సమయంలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఈ చిత్రంతోనే బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ తెలుగు పరిశ్రమకు హీరోయిన్‌గా పరిచయం అయింది. సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయం సాధించకపోయినా, కృతీ నటన, అందం ప్రేక్షకులను మెప్పించాయి. వెంటనే ఆమెకు మరో టాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా లభించింది.
Kriti sanon | నాగచైతన్య సరసన ‘దోచేయ్’
స్వామి రారాతో దర్శకుడిగా సంచలనం సృష్టించిన సుదీర్ వర్మ, తదుపరి ప్రాజెక్ట్‌గా నాగచైతన్య హీరోగా దోచేయ్‌ని రూపొందించారు. ఈ సినిమాలో కూడా కృతి హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద నిరుత్సాహపరిచింది. దీంతో కృతి (Kriti sanon) హిందీ ఫిల్మ్స్‌పై ఫోకస్ పెంచి బాలీవుడ్‌కి షిఫ్ట్ అయిపోయింది. ఇక బాహుబలి తర్వాత ప్రభాస్‌కు ఏర్పడిన పాన్ ఇండియా క్రేజ్ నేపథ్యంలో వరుసగా భారీ సినిమాలు అనౌన్స్ అయ్యాయి. వాటిలో ఆది పురుష్ కూడా ఒకటి. ఇందులో ప్రభాస్ సరసన సీత పాత్రలో కృతి సనన్ నటించింది. ఈ చిత్రం కూడా అంచనాలను అందుకోలేకపోయింది. అయితే ఇటీవల కృతి సనన్, విక్కీ కౌశల్, కాజోల్, ట్వింకిల్ ఖన్నా కలిసి టూ మచ్ టాక్ షోలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కృతి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
ముఖ్యంగా రిలేషన్‌షిప్ సెగ్మెంట్‌లో కృతి మాట్లాడాల్సి రావడంతో, ఆమె తన వ్యక్తిగత జీవితం బయటపెడుతుందని చాలామంది భావించారు. అయితే కృతి చాకచక్యంగా ఆ ప్రశ్నలను తప్పించుకుంది. అయినా విక్కీ కౌశల్ మాత్రం ఆమెను ఆటపట్టిస్తూ, రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ కబీర్ బాహియా పేరును ప్రస్తావించాడు.దానికి కృతి నవ్వుతూ స్పందించినప్పటికీ, ఏ విషయాన్నీ స్పష్టంగా చెప్పలేదు. అదే ఇంటర్వ్యూలో తాను చాలా రొమాంటిక్‌గా Romantic ఉంటానని తెలియజేయడమే కాకుండా, ప్రేమకథలు వినడం ఇష్టమని కృతి తెలిపింది. ఆ మధ్య ప్రభాస్‌తో ప్రేమలో ఉందని కూడా కొన్ని పుకార్లు వచ్చాయి. కాని అవన్నీ పుకార్లగానే మిగిలిపోయాయి.
