అక్షరటుడే, వెబ్డెస్క్: Dichpally Manavata Sadan | హెల్ప్ టు అదర్స్ , శ్రీ కృష్ణ ఫౌండేషన్ Sri Krishna Foundation ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా Nizamabad district డిచ్పల్లి మండలం Dichpally mandal ఘన్పూర్లోని మానవతా సదన్తో పాటు డిచ్పల్లి బీసీ వసతి BC hostel గృహాల్లోని 240 మంది విద్యార్థులకు ఉన్ని టోపీలు(మంకీ క్యాప్స్), గ్రాఫ్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు.
Dichpally Manavata Sadan | చలి తీవ్రత ఎక్కువైనందున..
ఈ సందర్భంగా అమెరికాకు చెందిన హెల్ప్ టు అదర్స్ స్వచ్ఛంద సంస్థ తెలంగాణ కోఆర్డినేటర్ విజయానంద్ మాట్లాడుతూ.. చలిని దృష్టిలో ఉంచుకొని సంస్థ వ్యవస్థాపకురాలు శ్రీలత కొరడా సమకూర్చిన రగ్గులు పంపిణీ చేసినట్లు తెలిపారు.
చలి తీవ్రత ఎక్కువైనందున ఉన్ని టోపీలు ఇచ్చామన్నారు. క్రమశిక్షణతో ఇష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాదించాలని విద్యార్థులకు సూచించారు. శ్రీకృష్ణ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బాలకృష్ణ, మనవతా సదన్ ఇన్ఛార్జి రమేష్, డిచ్పల్లి బీసీ వసతి గృహం ఇన్ఛార్జి దివ్య, శ్రీకృష్ణ ఫౌండేషన్ సభ్యులు సత్యనారాయణ, రాజేశ్వర్, పవన్ కుమార్, దయాకర్, నరోత్తం రెడ్డి, రాకేష్, తోడుకునూరి శ్రీనివాస్, రామ్ మోహన్, గణేష్, తులసి శ్రీనివాస్, రమేష్ పాల్గొన్నారు.