అక్షరటుడే, ఇందూరు: | దళితులు రాజకీయాలతో పాటు వ్యాపారంలోనూ రాణించాలని పద్మశ్రీ నర్రా రవికుమార్ (Narra Ravikumar) అన్నారు. ప్రభుదా భారత్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (Prabhuda Bharat International Foundation), డీఐసీసీఐ సంయుక్త ఆధ్వర్యంలో కృష్ణ హోటల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితులు ఉద్యోగులుగా కాకుండా ఉద్యోగాలను సృష్టించే వారీగా ఎదగాలన్నారు. పన్నులు చెల్లించే వారీగా మారాలన్నారు. రాజకీయాలకు అతీతంగా డీఐసీసీఐ పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పీబీఐఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్యాం, బ్లూ ఫిన్ సొల్యూషన్స్ ఎండీ రాజేందర్కుమార్, డీఐసీసీఐ రాష్ట్ర కో-ఆర్డినేటర్ నారాయణ, అగ్రికల్చర్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ గంగాధర్, టీజీవో అధ్యక్షుడు కిషన్, డీఐసీసీఐ జిల్లా కో-ఆర్డినేటర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
