అక్షరటుడే, కామారెడ్డి : Diarrhea cases : జిల్లాలో డయేరియా కేసులు అదుపులోనే ఉన్నాయని, కొత్తగా ఎలాంటి కేసులు నమోదు కాలేవని కామారెడ్డి ఆర్డీవో వీణ తెలిపారు. దేమీకలాన్ గ్రామంలో కూడా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. కామారెడ్డి జీజీహెచ్(Kamareddy GGH)లో డయేరియాతో చికిత్స పొందుతున్న తాడ్వాయి మండలం దేమికలాన్ బాధితులను గురువారం జిల్లా వైద్యాధికారి District Medical Officer చంద్రశేఖర్‌తో కలిసి ఆర్డీవో పరామర్శించారు.
బాధితుల ఆరోగ్య పరిస్థితుల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆర్డీవో మాట్లాడారు. గ్రామానికి చెందిన మొత్తం తొమ్మిది మంది డయేరియాతో ఆసుపత్రిలో చేరగా వైద్య సేవలు అందించామని తెలిపారు. వారిలో ఆరుగురి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించామన్నారు. మిగతా ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వారికి వైద్య సేవలు అందిస్తున్నట్టు తెలిపారు.
Diarrhea cases : ల్యాబ్‌కు నీటి శాంపిల్స్..
దేమీకలాన్ గ్రామాన్ని సందర్శించామని ఆర్డీవో తెలిపారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య క్యాంపు, పారిశుధ్య కార్యక్రమాలు, తాగునీరు సరఫరాను పర్యవేక్షించినట్లు పేర్కొన్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గ్రామంలోని ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ బోర్ వెల్స్, సింగిల్ ఫేస్ మోటార్స్ నుంచి సరఫరా అవుతున్న 18 మంచినీటి శాంపిల్స్ సేకరించి ల్యాబ్ పంపినట్లు వెల్లడించారు.
కాగా, నీరు శుద్ధమైనవిగా రిపోర్టు వచ్చిందన్నారు. ఆర్డబ్ల్యూఎస్ చీఫ్ ఇంజినీర్ RWS Chief Engineer శ్రీనివాస్ రెడ్డి, సూపరింటెండెంట్ Superintendent, ఇంజినీర్లు దేమీకలాన్ గ్రామంలో పర్యటించారన్నారు. వారు డ్రింకింగ్ వాటర్ సప్లయ్, పైప్‌లైన్, ట్యాంకులను పరిశీలించినట్లు తెలిపారు. ఎక్కడ కూడా ఎలాంటి వాటర్ లీకేజ్ లేదని వారు నిర్ధారించారన్నారు.
గ్రామంలో సాధారణ పరిస్థితి కొనసాగేలా పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ, మెడికల్ క్యాంపు నిర్వహణ, తాగునీరు సరఫరా ఇతర అన్ని కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఆర్డీవో చెప్పారు.