అక్షరటుడే, ఇందూరు: Nizamabad | రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (State Road Transport Corporation) నిజామాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో ఈనెల 24న సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు డయల్ యువర్ ఆర్టీసీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్ఎం జ్యోత్స్న (RM Jyotsna) తెలిపారు.
కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల ప్రయాణికులు (Passengers) ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్మూర్ 99592 26019, ఆర్ఎం కార్యాలయం 99592 26011, బోధన్ డిపో 99592 26001, నిజామాబాద్–1 డిపో 9959226016, నిజామాబాద్–2 డిపో 9959226017, కామారెడ్డి డిపో 9959226018, బాన్సువాడ డిపో 9959226020 నంబరును సంప్రదించాలన్నారు.
