అక్షరటుడే, భీమ్‌గల్: Bheemgal Police | డయల్ 100కు ఫోన్‌చేసి న్యూసెన్స్ చేసిన ఓ వ్యక్తికి న్యాయస్థానం జైలుశిక్ష విధించింది. కమ్మర్పల్లి ఎస్సై అనిల్‌రెడ్డి (Kammarpally SI Anil Reddy) తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన తన్నీరు వెంకటేష్ పలుమార్లు డయల్ 100కు ఫోన్ చేసి పోలీసుల సమయాన్ని వృథా చేశాడు.
దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి ఆర్మూర్ న్యాయస్థానంలో హాజరుపర్చారు. సెకండ్‌క్లాస్ మెజిస్ట్రేట్ (Second Class Magistrate) గట్టు గంగాధర్ కేసును విచారించి.. వెంకటేష్‌కు మూడురోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ సందర్భంగా ఎస్సై అనిల్ రెడ్డి మాట్లాడుతూ.. డయల్ 100 అత్యవసర సర్వీస్ అని.. ఆపదలో ఉన్న వారికి ఉపయోగపడే ఈ సదుపాయాన్ని దుర్వినియోగం చేయవద్దన్నారు.
