అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Diabetes Day | ఆరోగ్య నియమాలతో మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చని వెంబో క్లినిక్ వైద్యుడు బీఎస్ రెడ్డి (Vembo Clinic Doctor BS Reddy) సూచించారు. మోపాల్ మండలం కులాస్పూర్ గ్రామంలోని జీపీ వద్ద ఆదివారం ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహించారు.
ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని (World Diabetes Day) పురస్కరించుకొని వెంబో క్లినిక్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో భాగంగా ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేశారు. అనంతరం వైద్యుడు బీఎన్ రెడ్డి మాట్లాడుతూ.. మధుమేహం ఉన్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆహార నియమాలు పాటిస్తే షుగర్ కంట్రోల్లో ఉంటుందని చెప్పారు ప్రతిరోజు ఉదయం గంటసేపు వాకింగ్‌తో పాటు చిన్నపాటి వ్యాయామం చేయాలన్నారు. క్రమం తప్పకుండా పరీక్షలు చేసుకుంటూ షుగర్‌ను అదుపులో ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెంబో క్లినిక్ నిర్వాహకులు బొట్టు వెంకటేశం, గుండారం భూమేష్, కులాస్పూర్ గ్రామ కమిటీ సభ్యులు పి.లక్ష్మణ్, పృథ్వీరాజ్, గుండ్ల గంగారాం తదితరులు పాల్గొన్నారు.
