MS Dhoni | మ‌రోసారి వార్త‌ల‌లోకి ధోని రిటైర్మెంట్..అభిమానులు చూపించే ప్రేమ‌ని మ‌రిచిపోలేనంటూ కామెంట్
MS Dhoni | మ‌రోసారి వార్త‌ల‌లోకి ధోని రిటైర్మెంట్..అభిమానులు చూపించే ప్రేమ‌ని మ‌రిచిపోలేనంటూ కామెంట్

అక్షరటుడే, వెబ్​డెస్క్:MS Dhoni | ప్ర‌స్తుతం చెన్నై సూప‌ర్ కింగ్స్(Chennai Super Kings) కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ధోని Ms Dhoni తాజా సీజ‌న్‌లో ఓ మోస్త‌రు ప‌ర్‌ఫార్మెన్స్ చేస్తున్నాడు. అయితే ఇప్ప‌టికే అంత‌ర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన ధోని ఐపీఎల్‌(IPL)కి గుడ్ కూడా చెప్ప‌బోతున్నాడ‌నే వార్త‌లు కొన్నాళ్లుగా నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఈ సీజ‌న్ ధోనికి చివ‌రి సీజ‌న్ అని అంద‌రు చ‌ర్చించుకుంటూ ఉన్నారు. ఈ స‌మ‌యంలో ధోని తాజాగా త‌న రిటైర్మెంట్‌(Retirement)పై స్పందించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL 2025 లో బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో సీఎక్కే(CSK) విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ధోనీ మాట్లాడుతూ తన కెరీర్ చివరి దశలో ఉందని, రిటైర్మెంట్ సమయం దగ్గర పడిందంటూ హింట్ ఇచ్చాడు.

MS Dhoni | ఆలోచ‌న లేదు..

కాక‌పోతే వెంటనే రిటైర్మెంట్ Retirement ప్రకటించే ఆలోచన తనకు లేదని, సమయం వచ్చినప్పుడు దీనిపై నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. మ్యాచ్ ముగిసిన త‌ర్వాత ధోని(MS Dhoni) మాట్లాడుతూ.. నేను ఇప్ప‌టికీ అభిమానుల ప్రేమ‌ని పొందుతున్నాను. నా వయస్సు 42ఏళ్లు అని మర్చిపోవద్దు. నేను చాలాకాలంగా ఆడుతున్నాను. వారిలో చాలా మందికి నా చివరి మ్యాచ్ ఎప్పుడు జరుగుతుందో తెలియదు (నవ్వుతూ) కాబట్టి వారు వచ్చి నా ఆటను చూడాలనుకుంటున్నారు. ఈ ఐపీఎల్(IPL) ముగిసిన తరువాత నేను మరో ఆరు నుంచి ఎనిమిది నెలల కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. నా శరీరం ఈ ఒత్తిడిని తట్టుకోగలదా..? లేదా.. అని చూస్తాను.

నేను కెరీర్ చివరి దశలో ఉన్నానన్న విషయాన్ని అంగీకరించక తప్పదు. ఈ వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. రిటైర్మెంట్‌పై ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. అభిమానులు నాపై చూపే ప్రేమ, చూపించే ఆధరణ ఎన్నటికీ మరిచిపోలేదు’’ అని ధోని(MS Dhoni) వ్యాఖ్యానించారు. వచ్చే సీజన్ వరకు బాడీ సహకరిస్తే బరిలోకి దిగుతానని, లేదంటే రిటైర్మెంట్ ప్ర‌క‌టించే ఛాన్స్ ఉంద‌ని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పుకొచ్చాడు ధోని.ఇక గ‌త రాత్రి జ‌రిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ KKR 6 వికెట్లకు 179 పరుగులు చేసింది. కేకేఆర్ కెప్టెన్ కెప్టెన్ అజింక్య రహానే(Ajinkya Rahane) (48) మరోసారి రాణించాడు. ఆల్ రౌండర్ ఆండ్రే రస్సెల్(Andre Russell) (38) పరవాలేదనిపించాడు. ఛేజింగ్ లో సీఎస్కే 60 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడంతో ఓటమి ఖాయమని అంతా అనుకున్నారు. డెవాల్డ్ బ్రేవిస్(Dewald Brevis) (52 పరుగులు, 25 బంతులు, నాలుగు సిక్సర్లు, నాలుగు ఫోర్లు) అర్ధశతకంతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పవర్ హిట్టర్ శివమ్ దూబే(Shivam Dube) (45 పరుగులు, 40 బంతులు, మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు) 6వ వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం మ్యాచ్ ను సీఎస్కే వైపు తిప్పింది. 19.4 ఓవర్లలో 8 వికెట్లకు సీఎస్కే 183 పరుగులు చేసి కేకేఆర్ మీద ఉత్కంఠ పోరులో విజయం సాధించింది.