అక్షరటుడే, వెబ్‌డెస్క్ : MS Dhoni | భారత క్రికెట్ దిగ్గజం, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన క్రికెట్ భవిష్యత్‌పై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికే 44 ఏళ్ల వయసులో ఉన్న ధోని, వచ్చే ఐపీఎల్ సీజన్‌లో కూడా ఆడతారా? అనే ప్రశ్న అభిమానుల్లోనూ, క్రికెట్ వర్గాల్లో ఉత్కంఠకు దారి తీస్తోంది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోనిని, “ఆసియా కప్ (Asian Cup) ఆడతారా?” అని ప్రశ్నించారు. దానికి ధోని స్పందిస్తూ.. నేను ఆడతానో లేదో నాకు తెలియదు. డిసెంబర్ వరకూ సమయం ఉంది. రెండు నెలల్లో తుది నిర్ణయం తీసుకుంటాను అని ధోని స్పష్టంగా తెలిపారు.
MS Dhoni | ఇది క్లారిటీ..
ఈ సందర్భంగా అక్కడున్న ఓ అభిమాని, “సార్, మీరు తప్పకుండా ఐపీఎల్ ఆడాలి! అంటూ గట్టిగా అరిచాడు. దానికి ధోని (MS Dhoni) నవ్వుతూ, అయితే నా మోకాలి నొప్పిని ఎవరు చూసుకుంటారు? అంటూ చమత్కారంగా బదులిచ్చారు. దీంతో సభా మందిరం నవ్వులతో మార్మోగిపోయింది. గత ఐపీఎల్ అనంతరం ధోని మోకాలికి శస్త్రచికిత్స (Knee Surgery) చేయించుకున్నాడు. అయినా ఇప్పటికీ పూర్తిగా కోలుకోకపోవడంతో, అతని బ్యాటింగ్‌లో మునపటి జోరు కనిపించడం లేదు. మైదానంలో మళ్లీ పాత ధోనిని చూడాలన్న అభిమానుల ఆశలు మరోసారి నిరాశలో పడే ప్రమాదం కనిపిస్తోంది.
ధోని అభిమానులు అతను మరొకసారి పిచ్‌పై అడుగుపెట్టాలని కోరుకుంటున్నా, క్రికెట్ నిపుణులు (Cricket Experts) మాత్రం అందుకు భిన్నంగా స్పందిస్తున్నారు. యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించాలన్న దృక్పథంతో ధోనికి విశ్రాంతి అవసరమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎంఎస్ ధోని నిర్ణయం ఇంకా బహిర్గతం కానప్పటికీ, డిసెంబర్ కల్లా తన నిర్ణయం ప్రకటిస్తానని ఇప్పటికే తెలిపారు. అది క్రికెట్‌కు ఒక ఎమోషనల్ ఫేర్‌వెల్ అవుతుందా? లేదా అన్నది కాలమే చెప్పాలి.
