అక్షరటుడే, వెబ్‌డెస్క్: MS Dhoni | టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని (Ms Dhoni) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గ్రౌండ్లో ఎంత టెన్షన్ ఉన్నా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకునే ధోని, తన హాస్యంతో కూడా అందరినీ అలరిస్తుంటాడు.
ఇంటర్నేషనల్ క్రికెట్‌కి దూరంగా ఉన్న ధోని ఐపీఎల్లో మాత్రమే సందడి చేస్తున్నాడు. ఈ సీజన్లో ఆడతాడా లేదా అనే దానిపై అనేక అనుమానాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం తన ఫ్యామిలీతో సంతోషంగా గడుపుతున్నాడు ధోని. అయితే రీసెంట్గా వివాహ వేడుకలో పాల్గొన్న ధోని అక్కడ చేసిన సరదా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతున్నాయి.
MS Dhoni | “కొంతమంది నిప్పుతో ఆడాలని ఇష్టపడతారు… ధోని సెటైర్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ధోని పెళ్లిపై సరదా కామెంట్ చేశాడు. వివాహ వేడుకలో పాల్గొని.. వరుడిని ఉద్దేశిస్తూ.. వివాహం అనేది మంచిదే. కానీ కొంతమంది నిప్పుతో చెలగాటమాడాలని అనుకుంటారు… పెళ్లి కొడుకు (bride groom) కూడా వారిలో ఒకరే అని చెప్పడంతో అక్కడున్నవారంతా గట్టిగా కేకలు వేశారు. అదే ఉత్సాహంలో ధోని మరో సెటైర్ కూడా వదిలాడు నేను మినహాయింపు కాదు. నా భార్య కూడా అలాగే ఉంటుంది. ఇక్కడున్న భర్తలందరి పరిస్థితి కూడా ఇదే. నువ్వు వరల్డ్ కప్ గెలిచావా? లేదా? అనేది అసలు విషయం కాదు అని చెప్పడంతో ప్రేక్షకులు మరింతగా నవ్వుకున్నారు.
ఆ తర్వాత ధోని వధువుకు ముఖ్యమైన సలహా ఇచ్చాడు. భర్త కోపంగా ఉన్నప్పుడు ఏమీ మాట్లాడకండి. భర్తల కోపం ఎక్కువ కాలం ఉండదు… ఐదు నిమిషాల్లో చల్లారిపోతుంది. వారికి ఎన్నో టెన్షన్లు ఉంటాయి. మీరు అర్థం చేసుకోవాలి అని చెప్తూ, దంపతులకు శుభాకాంక్షలు తెలిపాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో (Social media) హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాహ వేడుక ఎక్కడ, ఎప్పుడు జరిగిందో స్పష్టంగా తెలియదు కాని ధోని ఇచ్చిన పెళ్లి అడ్వైజ్, ఫన్నీ పంచ్‌లు సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్నాయి. ధోని సింపుల్‌నెస్, హాస్యం మరోసారి అభిమానులను ఆకట్టుకుంది. మిస్టర్ కూల్ స్టైల్లో చెప్పిన ఈ ఫన్నీ, సెన్సిబుల్ కామెంట్స్ నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తున్నాయి.