68
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vishwa Hindu Parishad | భాగ్యనగర్‌లో జరిగిన విశ్వహిందూ పరిషత్ (Vishwa Hindu Parishad) గోరక్ష ప్రాంత సమావేశంలో నిజామాబాద్ నగరానికి (Nizamabad city) చెందిన ధాత్రిక రమేశ్‌ను తెలంగాణ ప్రాంత గోరక్ష విభాగం సభ్యుడిగా, గోరక్ష కృషి సంపర్క ప్రముఖ్‌గా నియమించారు.
గోరక్ష కృషి సంపర్క ప్రముఖ్‌గా బాధ్యతలు స్వీకరించిన రమేశ్‌ను వీహెచ్‌పీ విభాగ్ కార్యదర్శి జిల్లా సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇందూర్ జిల్లా విభాగ్ కార్యదర్శి తమ్మల కృష్ణ, జిల్లా అధ్యక్షుడు దినేష్ ఠాకూర్, జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, కోశాధికారి నాంపల్లి శేఖర్, జిల్లా సేవా ప్రముఖ్ రామ్ ప్రసాద్ చటర్జి, నవీన్, ఘన్ శ్యాం పాల్గొన్నారు.