అక్షరటుడే, ఆర్మూర్ : Farmers | అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్మూర్ పట్టణంలోని ఆలూరు బైపాస్ రోడ్డులో అన్నదాతలు రాస్తారోకో(Rastharoko) నిర్వహించారు. 20 రోజులుగా కొనుగోలు కేంద్రం(Purchase center)లో ధాన్యం కొనడం లేదని రైతులు ఆరోపించారు. దీంతో వర్షాలకు ధాన్యం తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు(Farmers) డిమాండ్ చేశారు. కలెక్టర్, ఆర్డీవో రావాలని నినాదాలు చేశారు. వాహనాలకు అడ్డంగా పడుకొని రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆర్డీవో రాజాగౌడ్(RDO Rajagoud) సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చించారు. తడిసిన ధాన్యాన్ని రైతులు స్వయంగా ఆర్డీవోను తీసుకెళ్లి చూపించారు. ధాన్యాన్ని సకాలంలో కొనులు చేసే విధంగా చర్యలు చేపడతామని ఆర్డీవో హామీ ఇచ్చారు. రైతుల ధర్నాకు బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆశన్నగారి రాజేశ్వర్ రెడ్డి, బీజేపీ నాయకులు నూతుల శ్రీనివాస్ రెడ్డి తదితరులు మద్దతు తెలిపారు.