Homeజిల్లాలునిజామాబాద్​Pothangal | పంచాయతీ కార్యదర్శి తీరుకు నిరసనగా ధర్నా

Pothangal | పంచాయతీ కార్యదర్శి తీరుకు నిరసనగా ధర్నా

పోతంగల్​ మండలంలో పంచాయతీ కార్యదర్శి తీరును నిరసిస్తూ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.

- Advertisement -

అక్షరటుడే, కోటగిరి: Pothangal | పంచాయతీ కార్యదర్శి (Panchayat Secretary) తీరును నిరసిస్తూ పోతంగల్​ మండల (Pothangal mandal) కేంద్రంలో గ్రామస్థులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని పలు కాలనీల్లో నెలకొన్న సమస్యలను కార్యదర్శి పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యాలయంలో ఉన్న పాత ఇనుప వస్తువులను వేలం వేయకుండా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, గ్రామ పెద్దలకు ఎలాంటి సమాచారం లేకుండా అమ్మేశారని మండిపడ్డారు.

గ్రామ ప్రజలెవరైనా సమస్యలను విన్నవించేందుకు ఫోన్​చేస్తే జవాబు కూడా ఇవ్వడం లేదని.. డబ్బులు తీసుకోనిదే ఏ పనీ జరగట్లేదని వారు ఆరోపించారు. ఎంపీడీవోకు సైతం సమాచారం అందించామని వివరించారు. పలు కాలనీల్లో తాగునీటి సమస్య తలెత్తుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే ఆయనను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీవో చందర్​కు (MPDO Chander) వినతిపత్రం అందజేశారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని గ్రామస్థులకు ఎంపీడీవో హామీ ఇచ్చారు. కార్యక్రమంలో హన్మాండ్లు (బజరంగ్), పబ్బశేఖర్, సయ్యద్ హైమద్, నవీన్, వల్లెపు కురుమయ్య, చిన్న సాయిలు, కొట్టెల గంగారాం, కన్నం రాము, లక్ష్మణ్, ఒడ్డి నాగయ్య, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.