అక్షరటుడే, బాన్సువాడ: Indiramma housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో ఆదివారం బీర్కూర్ మండల కేంద్రంలో పోచారం కాలనీకి చెందిన పలువురు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జాబితాలో అనర్హులకు చోటు కల్పించి.. అర్హులమైన తమకు అన్యాయం చేశారని ఆందోళనకు దిగారు. నాయకులు, అధికారులు అనుకూలంగా ఉన్న వారికి.. అర్హత లేకపోయినా ఇందిరమ్మ ఇళ్లు(Indiramma Houses) మంజూరు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.
Indiramma housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం రాస్తారోకో
- Advertisement -   

