Dharmapuri Sanjay Post | ధర్మపురి సంజయ్​కు గౌరవప్రదమైన పదవి ఇవ్వాలి..

అక్షరటుడే, ఇందూరు: Dharmapuri Sanjay Post | మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్​కు (Dharmapuri Sanjay) గౌరవప్రదమైన పదవి ఇచ్చి మున్నూరుకాపుల (Munnurukapu Sangham) అభ్యున్నతికి పాటుపడాలని సంఘం ప్రతినిధులు కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్​లోని గాంధీభవన్​లో (Gandhi Bhavan Hyderabad) ప్రతినిధికి వినతిపత్రం అందజేశారు. Dharmapuri Sanjay Post | 12ఏళ్లుగా సరైన ప్రాతినిథ్యం లేక.. ఈ సందర్భంగా జిల్లా మున్నూరుకాపు సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. 12ఏళ్లుగా జిల్లాలో మున్నూరుకాపులకు సరైన […]

అక్షరటుడే, ఇందూరు: Dharmapuri Sanjay Post | మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్​కు (Dharmapuri Sanjay) గౌరవప్రదమైన పదవి ఇచ్చి మున్నూరుకాపుల (Munnurukapu Sangham) అభ్యున్నతికి పాటుపడాలని సంఘం ప్రతినిధులు కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్​లోని గాంధీభవన్​లో (Gandhi Bhavan Hyderabad) ప్రతినిధికి వినతిపత్రం అందజేశారు.

Dharmapuri Sanjay Post | 12ఏళ్లుగా సరైన ప్రాతినిథ్యం లేక..

ఈ సందర్భంగా జిల్లా మున్నూరుకాపు సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. 12ఏళ్లుగా జిల్లాలో మున్నూరుకాపులకు సరైన ప్రాతినిథ్యం లేదన్నారు. జిల్లాలో 4లక్షలకు పైగా మున్నూరుకాపు ఓటర్ల ఉన్నప్పటికీ రాజకీయంగా ఎలాంటి గుర్తింపు లేదని వాపోయారు. కాంగ్రెస్​ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ అని ప్రస్తుతం ప్రజాప్రభుత్వ పాలనలో ఉన్నందును మున్నూరుకాపులకు సరైన న్యాయం చేయాలని వారు కోరారు.

మాజీ మేయర్​కు గౌరవప్రదమైన పదవి ఇవ్వాలి..

మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్​కు జిల్లాలో గౌరవప్రదమైన పదవి ఇవ్వాలని వారు కోరారు. తద్వారా మున్నూరుకాపుల అభ్యున్నతికి నాంది పలకాలని వారు సూచించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోను మున్నూరుకాపులు క్రియాశీలకంగా పని చేశారన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ మున్నూరు కాపులకు ఇచ్చిన ప్రాతినిథ్యాన్ని ఎన్నటికీ మర్చిపోమని పేర్కొన్నారు. కాంగ్రెస్​ పార్టీకి ఎల్లప్పుడూ మున్నూరుకాపులు అండగా ఉన్నారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

Second edition CM Cup | సెకండ్​ ఎడిషన్​ సీఎం కప్​ రాష్ట్రస్థాయి యోగాసన పోటీలు.. ప్రతిభ చూపిన కాకతీయ ఒలంపియాడ్​ విద్యార్థిని

అక్షరటుడే, ఇందూరు: Second edition CM Cup | హైదరాబాద్​లోని సరూర్​నగర్​ ఇండోర్ స్టేడియంలో ఈనెల 20 నుంచి సెకండ్ ఎడిషన్ సీఎం కప్...

Telangana budget | మార్చి 16 నుంచి 30 వరకు అసెంబ్లీ సమావేశాలు.. 20న తెలంగాణ బడ్జెట్!

అక్షరటుడే, హైదరాబాద్​: Telangana budget | తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ముహూర్తం నిర్ణయం అయింది. వచ్చే నెల (మార్చి) 16వ తేదీ నుంచి...

Hyderabad Park Encroachments | పార్కుల క‌బ్జాపై హైడ్రాకు ఫిర్యాదుల వెల్లువ‌

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Park Encroachments | హైదరాబాద్​లో అనేక పార్కు స్థలాలు కబ్జాలకు గురి అయ్యాయి. లే అవుట్​ వేసిన సమయంలో...

Telangana Cabinet Decisions | తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Cabinet Decisions | తెలంగాణ కేబినెట్​ కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన...