అక్షరటుడే, ఇందూరు: Dharmapuri Sanjay | నిజామాబాద్ Nizamabad జిల్లా మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ధర్మపురి సంజయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నిజామాబాద్ నగరం Nizamabad city లో బుధవారం (అక్టోబరు 29) జరిగిన కార్యక్రమంలో ధర్మపురి సంజయ్‌ని జిల్లాలోని ఆయా మండలాల మున్నూరు కాపు సంఘాల ప్రతినిధులు ఎన్నుకున్నారు.
Dharmapuri Sanjay | గతంలో డీఎస్
మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా గతంలో ధర్మపురి శ్రీనివాస్ Dharmpuri Srinivas ఉంటూ వచ్చారు. ఆయన కాలం చేశాక.. తాజాగా ఆ బాధ్యతలను డీఎస్ పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్‌కు సంఘాల ప్రతినిధులు అప్పగించారు.
ఈ సందర్భంగా ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ.. మున్నూరు కాపులకు వెన్నుదన్నుగా నిలిచి, సంఘాలను ఏకతాటిపై నడిపిన తన తండ్రి డీఎస్ ఆశీర్వాదంతో సభ్యులకు సేవ చేసుకుంటానన్నారు.
తనపై నమ్మకంతో మున్నూరు కాపు సంఘం Munnur Kapu Sangam జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న మండల, పట్టణ సంఘాల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

