Homeజిల్లాలునిజామాబాద్​Dharmapuri Foundation | ధర్మపురి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిత్యావసరాల అందజేత

Dharmapuri Foundation | ధర్మపురి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిత్యావసరాల అందజేత

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Dharmapuri Foundation | జిల్లాలో కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో వర్షాలు, వరదల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది.

దీంతో నిరాశ్రయులైన ప్రజలకు నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ ధర్మపురి (Nizamabad MP Arvind Dharmapuri) తన ఫౌండేషన్‌ ద్వారా అండగా నిలిచారు. ధర్మపురి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శనివారం 500 నిత్యావసర కిట్లను పంపిణీ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్‌ కులాచారి (Dinesh Kulachari), మండలాధ్యక్షులు, పార్టీ కార్యకర్తల చేతుల మీదుగా నిరాశ్రయులైన ప్రజలకు నిత్యావసర కిట్లను అందించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Must Read
Related News