అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Dharmapuri Arvind Comments | బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Arvind) సంచలన వ్యాఖ్యలు చేశారు. 20 ఏళ్లుగా పార్టీని పట్టి పీడిస్తున్న కోవర్టులు వెళ్లిపోవాలన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఉత్తర తెలంగాణలో బీజేపీ (BJP) బలపడిందని ఎంపీ అర్వింద్ అన్నారు. దక్షిణ తెలంగాణలో బలోపేతం కావాల్సి ఉందన్నారు. త్వరలో బీజేపీ భూ స్థాపితం అవుతుందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) చేసిన వ్యాఖ్యలకు ఆయన స్పందించారు. ఆమె వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎవరి వల్ల ఎవరు భూస్థాపితం అయ్యారో ప్రజలకు తెలుసన్నారు.
Dharmapuri Arvind Comments | వారు కలిసి ఉండలేరు
నిజామాబాద్ కార్పొరేషన్లో కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ (BRS) మద్దతు తెలిపిందని అర్వింద్ చెప్పారు. కేసుల కోసమే బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు కలిసి ఉండలేరని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో తన కుటుంబ అవినీతిని ఎవరు అడగకుండా ఉండేందుకు కొనడం మొదలు పెట్టారని ఆరోపించారు. కేసీఆర్ (KCR) వ్యవస్థలను నాశనం చేశారని, రేవంత్‌రెడ్డి దానిని కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. తాము వ్యవస్థలను ప్రక్షాళన చేయాలనుకున్నామని తెలిపారు. అందుకే ఎవరితో కలవలేదన్నారు.
పలువురు సీనియర్ నాయకులను ఉద్దేశించి ఎంపీ అర్వింద్ కోవర్టులు అని వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయింది. మెట్పల్లి (Metpalli)లో బీజేపీ నాయకుడు సుఖేందర్ రెడ్డిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు. సుఖేందర్ రెడ్డి పార్టీని విడిచి వెళ్లిపోయారు. దీనిపై ఎంపీ స్పందిస్తూ.. పార్టీకి పట్టిన పీడ పోయిందన్నారు. ఆయనకు, ఆయన భార్యకు ఇద్దరికీ టికెట్ ఇవ్వనని చెప్పడంతో వెళ్లిపోయాడని పేర్కొన్నారు. సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ కోవర్టు అని ఆయన ఆరోపించారు. కరీంనగర్‌ను నిజామాబాద్‌తో పోల్చలేమని ఆయన అన్నారు.