అక్షరటుడే, ఇందూరు : Dharmapuri Arvind Comments | నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక (Nizamabad Corporation Chairman Election) సందర్భంగా ఎంపీ అర్వింద్ కీలకవ్యాఖ్యలు చేశారు. నగరంలోని కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.
Dharmapuri Arvind Comments | కార్పొరేషన్ కాలపరిమితి పూర్తయ్యేలోపు..
ప్రస్తుత నిజామాబాద్ కార్పొరేషన్ పాలకవర్గం కాల పరిమితి పూర్తయ్యేలోపు కచ్చితంగా బీజేపీ అభ్యర్థిని (BJP Candidate) మేయర్‌గా చేస్తానని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. మేయర్ ఎన్నిక అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ (Congress), ఎంఐఎం (MIM), బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని పేర్కొన్నారు.
Dharmapuri Arvind Comments | ఇందుకే కేటీఆర్‌పై రేవంత్ కేసులు పెట్టలేదు..
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లుగా కేటీఆర్ (KTR)పై ఇందుకే కేసులు పెట్టలేదని అర్వింద్ ఆరోపించారు. లోలోపల కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనన్నారు. ఇందూరులో బీజేపీని ఓడించేందుకు అనైతిక పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు.
అధికారపార్టీకి పోలీసుల వత్తాసు..
కాంగ్రెస్‌కు కొందరు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఎంపీ ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థిని విజయలక్ష్మిని దాచిపెట్టడంలో పోలీసులు కీలకపాత్ర పోషించారన్నారు. అలాగే తాము డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా బంటు రామును నిలబెట్టామని కాని స్వల్ప మెజారిటీతో ఓడిపోయామన్నారు.