ePaper
More
    HomeసినిమాKubera | థియేట‌ర్‌లో సంద‌డి చేసిన శేఖ‌ర్ క‌మ్ముల, ధ‌నుష్‌.. రియాక్ష‌న్ కేక‌..!

    Kubera | థియేట‌ర్‌లో సంద‌డి చేసిన శేఖ‌ర్ క‌మ్ముల, ధ‌నుష్‌.. రియాక్ష‌న్ కేక‌..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Kubera | నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘కుబేర’ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మ‌రోవైపు ఈ సినిమాకు ప‌లువురు సినీ ప్ర‌ముఖుల నుండి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. డ్యాన్సింగ్ క్వీన్.. సాయి పల్లవి మాట్లాడుతూ “‘కుబేర’(Kubera) ఎంతో ప్రత్యేకమైన చిత్రం. సవాలుతో కూడిన పాత్రలను ఎంచుకోవడంలో ముందుండే ధనుష్ మరోసారి తన నటనతో ఆకట్టుకుంటారు. శేఖర్ కమ్ముల(Shekhar Kammula) దర్శకత్వంలో నాగార్జున(Nagarjuna) ఇలాంటి అద్భుతమైన పాత్రలో చూడడం అభిమానులకు పండుగే. రష్మిక పోషించిన పాత్ర కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ గారి కెరీర్‌లోని ఉత్తమ ఆల్బమ్‌లలో ఇది ఒకటి అవుతుంది” అని పేర్కొన్నారు.

    Kubera | సందడే సంద‌డి..

    ఉదయం ఆటల నుంచే సినిమాకు పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. చాలా కాలం తర్వాత ఒక మంచి సినిమా చూశామంటూ సినీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. విదేశాల్లో కూడా ‘కుబేర’ చిత్రానికి మంచి టాక్ వచ్చిందని సమాచారం. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల, నటుడు ధనుష్(Hero Dhanush) సినిమా టాక్ తెలుసుకోవడానికి అభిమానులతో కలిసి సినిమాను వీక్షించారు. చెన్నై(Chennai)లోని ఒక ప్రముఖ థియేటర్‌(Theater)కు వెళ్లిన వీరు, అక్కడ అభిమానుల మధ్య కూర్చుని ‘కుబేర’ సినిమా చూశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ స‌మ‌యంలో ధనుష్ కొంద‌రు ఫ్యాన్స్‌కు షేక్ హ్యాండ్ కూడా ఇచ్చారు.

    చిత్రంలో ధనుష్ అద్భుతంగా నటించాడు అనేకంటే ప్రాణం పెట్టాడు అనాలి. ఇలాంటి క్యారెక్టర్ చేయాలంటే చాలా ధైర్యం కావాలి. నాగార్జున ఈ సినిమాకు అతి పెద్ద ప్లస్ పాయింట్.. ఆయన క్యారెక్టర్ అదిరిపోయింది. మంచికి, చెడుకు మధ్య నలిగిపోయే పాత్ర ఇది. ఇంత సీరియస్ కథలో రష్మిక మందన్న(Heroine Rashmika Mandanna)తో కామెడీ చేయించాడు దర్శకుడు శేఖర్. ఆమె పాత్రను డిఫెరెంట్‌గా రాసుకున్నాడు. బాలీవుడ్ నటుడు జిమ్ సార్బ్ బాగా చేశాడు. నాగార్జున భార్యగా చిన్న పాత్రలో సునయన బాగా నటించింది. మిగిలిన నటులంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. దేవి శ్రీ ప్రసాద్ పాటలు, బ్యాక్​ గ్రౌండ్​ స్కోర్ సినిమా స్థాయిని పెంచేశాయి. సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది. ఎడిటింగ్ కాస్త లెంత్ అనిపించింది కానీ దర్శకుడి ఛాయిస్ కాబట్టి ఆయన్ని తప్పు బట్టలేం. శేఖర్ కమ్ముల దర్శకుడిగా కంటే రైటర్‌గా అదరగొట్టాడు. కొన్ని సీన్స్ అయితే పీక్స్‌లో ఉన్నాయి. నిర్మాతలు కథకు తగ్గట్లు ఖర్చు పెట్టారు.

    More like this

    Lunar Eclipse | చంద్రగ్రహణం వేళ.. ఏం చేయాలంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Lunar Eclipse | భాద్రపద పౌర్ణమి రోజున అంటే ఈనెల 7న అరుదైన రాహుగ్రస్త...

    September 6 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 6 Panchangam : తేదీ (DATE) – సెప్టెంబరు 6,​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    Shobha Yatra | శోభాయాత్ర ప్రారంభం.. గట్టి బందోబస్తు.. కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణ

    అక్షరటుడే, కామారెడ్డి : Shobha Yatra : కామారెడ్డి పట్టణంలో గణేష్ శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. ఆనవాయితీ ప్రకారం...