
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Dhanashree Verma | టీమిండియా సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ మాజీ భార్య, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ చేసిన తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఓ రియాల్టీ షో(Reality Show)లో పాల్గొన్న ధనశ్రీ, చాహల్ తనపై తప్పుడు ప్రచారం చేశాడంటూ నేరుగా విమర్శలు గుప్పించింది.
ఓ టీవీ రియాల్టీ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్న ఈ అమ్మడు తన విడాకులకి(Divorce) సంబంధించి వచ్చిన పుకార్లకు వివరణ ఇచ్చుకుంది. ముఖ్యంగా చాహల్‌ను తాను మోసం చేసినట్టు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం అని స్పష్టం చేసింది.. ఇదంతా నెగటివ్ పీఆర్‌లో భాగంగానే జరిగిందని ఆరోపించింది. తన సహచర కంటెస్టెంట్ అర్బాజ్ పటేల్.. చాహల్‌ను ధనశ్రీ వర్మ(Dhanashree Verma) మోసం చేసిందనే మాటలు నా దగ్గరకు వచ్చాయని అనడంతో ధనశ్రీ .. చాహల్ పేరు ఎత్తకుండా విమర్శలు గుప్పించింది.
Dhanashree Verma | ధన శ్రీ కామెంట్స్..
“నేను ఎక్కడ నోరు తెరుస్తానేమోనని భయపడి నెగటివ్ పీఆర్ స్టంట్ చేశాడు. నేను మోసం చేశానన్న ఆరోపణలు పూర్తిగా అసత్యం. అవన్నీ పుకార్లే. ఎవరో ప్లాన్‌చేసిన స్క్రిప్ట్.నేను ఎక్కడ నోరు తెరుస్తానేమోనని భయపడి ఇలాంటి ప్రచారానికి తెరలేపారు. అసలు విషయాలు చెబితే ఈ షో మరోలా మారిపోతుంది అని ధనశ్రీ చెప్పుకొచ్చింది. చాహల్(Chahal)తో నాకు విడాకులయ్యాయి , ఇప్పుడు అతని గురించి పట్టించుకోవల్సిన అవసరం నాకు లేదు. పెళ్లి అనే బంధంలో ఉన్నప్పుడు ఇద్దరం రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. మన ఇమేజ్ కోసం మరొకరిని ఎందుకు తక్కువ చేయాలి. నా గురించి నెగటివ్ మాట్లాడితే మీకు వచ్చే లాభం ఏం లేదు.’అని ధనశ్రీ ఘాటుగా బదులిచ్చింది.
ఇక చాహల్‌తో విడాకుల సమయంలోనే ధనశ్రీకు టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్తో ఎఫైర్ ఉందన్న వార్తలు జోరుగా వచ్చాయి. ఇద్దరూ కలిసి కొన్ని ఈవెంట్‌లకు హాజరవ్వడం, డ్యాన్స్ వీడియోలు వైరల్ కావడంతో ఆ ప్రచారానికి బలం చేకూరింది. అయితే ఈ ఆరోపణలపై ధనశ్రీ ఇప్పటివరకు నేరుగా స్పందించలేదు. విడాకుల అనంతరం చాహల్ ప్రముఖ ఆర్జే తో డేటింగ్ చేస్తున్నట్లు గాసిప్స్ హల్‌చల్ చేశాయి. వీరిద్దరూ బహిరంగంగా కనిపించడం, సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేయడం ఈ వార్తలకు బలం చేకూర్చింది. అయితే ధన శ్రీ కామెంట్స్ పై చాహల్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఒకవేళ ఈ వివాదం ఇంకా ముదిరితే, ఇద్దరి వ్యక్తిగత జీవితం మరోసారి పబ్లిక్ డొమెయిన్‌లోకి వచ్చే అవకాశం ఉంది.