అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Constable Pramod | రౌడీ షీటర్ దాడిలో మృతి చెందిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivdhar Reddy) పరామర్శించారు. నిజామాబాద్ నగరంలో (Nizamabad city) న్యూ బ్యాంక్ కాలనీలో గల ప్రమోద్ ఇంటికి మంగళవారం చేరుకున్నారు.
ఈ సందర్భంగా ప్రమోద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సౌకర్యాలను అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాతో పాటు ఇంటి స్థలం, ఉద్యోగం వీలైనంత త్వరగా కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. ఆయన వెంట ఐజీ చంద్రశేఖర్ రెడ్డి (IG Chandrasekhar Reddy), సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya), అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి, ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, పోలీసు సిబ్బంది ఉన్నారు.
కాగా.. అంతకుముందు నిజామాబాద్ జిల్లాకు వచ్చిన డీజీపీకి ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో పాటు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్య స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డీజీపీకి పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం ఆయన కానిస్టేబుల్ ప్రమోద్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.