ePaper
More
    HomeజాతీయంPlane Crash | విమాన ప్రమాదం నేపథ్యంలో డీజీసీఏ కీలక నిర్ణయం

    Plane Crash | విమాన ప్రమాదం నేపథ్యంలో డీజీసీఏ కీలక నిర్ణయం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Plane Crash | అహ్మదాబాద్​ విమాన ప్రమాదం (Ahmedabad plane crash)లో ఎంతోమంది మరణించారు. ఈ ఘటనపై యావత్​ దేశం విచారం వ్యక్తం చేసింది. అహ్మదాబాద్​ నుంచి లండన్ వెళ్లాల్సిన ఫ్లైట్​ టేకాఫ్​ అయిన కొద్ది సేపటికే కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 269 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో విమానంలోని 241 మంది, మెడికల్​ కాలేజీ విద్యార్థులు 28 మంది ఉన్నారు. విమాన ప్రమాదం నేపథ్యంలో డీజీసీఏ (DGCA) కీలక ఆదేశాలు జారీ చేసింది.

    అహ్మదాబాద్​లో జరిగిన విమాన ప్రమాదంలో ఎయిర్​ ఇండియా (Air India)కు చెందిన బోయింగ్​ 787–8 డ్రీమ్​ లైనర్ కూలిపోయింది. ఈ క్రమంలో డైరెక్టరేట్​ జనరల్ ఆఫ్​ సివిల్​ ఏవియేషన్ (DGCA) సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌లోని అన్ని బోయింగ్‌ విమానాల (Boeing Planes) తనిఖీ చేయాలని ఆదేశించింది. బోయింగ్ విమానాలు తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని సూచించింది. DGCA ఆదేశాలతో ఎయిర్​ ఇండియా చర్యలు చేపట్టింది. బోయింగ్​ 787 సిరీస్ విమానాలపై ప్రత్యేక ఆడిట్ నిర్వహిస్తోంది.

    Plane Crash | అంతులేని విషాదం

    విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. విమానంలోని ప్రయాణికులు సిబ్బంది కలిపి 241 మంది మరణించారు. విమానంలోని ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. మరోవైపు బీజే మెడికల్​ విద్యార్థులు 28 మృతి చెందారు. మొదట 24 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. అయితే భవన శిథిలాల కింద మరో నలుగురి మృతదేహాలు లభించాయి. అహ్మదాబాద్​లోని సివిల్​ ఆస్పత్రి (Civil Hospital)లో డీఎన్​ఏ టెస్ట్​ చేసి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. తమ వారి మృతదేహాల కోసం కుటుంబ సభ్యులు, బంధువులు సివిల్​ ఆస్పత్రిలో నిరీక్షిస్తున్నారు.

    Latest articles

    Cyberabad Police | తగ్గేదే లే అంటున్న మందుబాబులు.. ఎంత మంది చిక్కారంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cyberabad Police | హైదరాబాద్ (Hyderabad) నగరంలో వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. ఏ...

    Cooking Oil | అధిక నూనె వాడకంపై యుద్ధం.. ప్రధాని మోదీ అలా ఎందుకు అన్నారు..?

    అక్షరటుడే, హైదరాబాద్: Cooking Oil | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) వంట నూనె...

    GST Reforms | కొత్త జీఎస్టీ స్లాబ్​లు ఇవేనా.. కేంద్ర నిర్ణయంపై ఉత్కంఠ..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GST Reforms | జీఎస్టీలో సంస్కరణలు తీసుకొస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM...

    Pulasa | వామ్మో.. కిలో చేపలు రూ.25 వేలా..!

    అక్షరటుడే, హైదరాబాద్: Pulasa | సాధారణంగా చేపలు చాలామందికి ఇష్టమే. కానీ, కొన్ని రకాల చేపలకు మాత్రం విపరీతమైన...

    More like this