అక్షరటుడే, ముప్కాల్/మెండోరా : Animal Husbandry Department | గ్రామాల్లో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముప్కాల్, మెండోరా మండలాల్లోని (Mendora Mandal) గ్రామాల్లో శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Animal Husbandry Department | ముప్కాల్ మండలంలో..
మండలంలోని నాగంపేట్ గ్రామం (Nagampet Village)లో 1,653 మేకలు, గొర్రెలకు ఉచిత నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు. నాగంపేట్ సర్పంచ్ దాసరి గంగాధర్, ఉపసర్పంచ్ మదన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారిణి ఆర్. ఉజ్వల, గోపాలమిత్ర ప్రణీత్, షకీల్, బషీర్, ఆఫీస్ సబార్డినేట్ లక్ష్మి, జీవాల పెంపకదారులు ముత్యం, నవీన్, శ్రీనివాస్, భీమేశ్, మల్లయ్య, దాసు, చిన్న ముత్యం పాల్గొన్నారు.
Animal Husbandry Department | మెండోరా మండలంలో..
మండలంలోని బుస్సాపూర్ గ్రామం (Bussapur Village)లో మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బుస్సాపూర్ సర్పంచ్ నూత్పల్లి శ్రీనివాస్, ఉపసర్పంచ్ ముర్పూర్ సతీష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎ. సాయారెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు నాగరాజు, వార్డు సభ్యుడు జె.రాజన్న పాల్గొని జీవాలకు మందులు వేశారు. పశువైద్యాధికారి గౌతమ్ రాజు, పశువైద్య సహాయకుడు ప్రవీణ్, ఆఫీస్ సబార్డినేట్ మల్లేష్, జీవాల పెంపకదారులు అంగోల సాయన్న, అంగోల పెద్ద సాయన్న, గుజ్జ నర్సయ్య, మేకల చంద్రబోస్, గుజ్జ మల్లయ్య, మేకల అశోక్ పాల్గొన్నారు. శనివవారం దూదిగాం గ్రామం (Dudigam Village)లో మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు డాక్టర్ గౌతమ్ రాజు వివరించారు.
