అక్షరటుడే గాంధారి: Mla Dhanpal | ఏకాగ్రత పెంచుకోవడానికి భక్తి ఒక మార్గమని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana) అన్నారు. గాంధారి మండలంలోని నారాయణగిరి వద్ద వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం (Vasavi Kanyaka Parameshwari Temple) భూమిపూజకు కర్ణాటకలోని అల్దిపురం మఠం వామనాశ్రమ మహాస్వామీజీ విచ్చేయగా, ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే ధన్పాల్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి హిందువు మానసిక ప్రశాంతత కోసం దేవాలయాలను సందర్శించాలని సూచించారు. సనాతన ధర్మం (Sanatana Dharma) కాపాడుకునే బాధ్యత ప్రతిఒక్క హిందువుపై ఉందన్నారు. ధర్మ పరిరక్షణ కోసం కావడి నుంచి వారణాసి వరకు 4,500 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించిన హల్దిపురం మఠం స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. అనంతరం కన్యకాపరమేశ్వరి ఆలయానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు కిషన్, పట్టణ అధ్యక్షుడు సంతోష్, లక్ష్మీకాంత్, దినేష్, ప్రశాంత్, సోమశేఖర్, రవి పాల్గొన్నారు.
