HomeతెలంగాణSaraswati Pushkaralu | సరస్వతి పుష్కరాలకు పోటెత్తిన భక్తులు

Saraswati Pushkaralu | సరస్వతి పుష్కరాలకు పోటెత్తిన భక్తులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Saraswati Pushkaralu | భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం (Kaleshwaram Triveni Sangam) వద్ద కొనసాగుతున్న సరస్వతి పుష్కరాలకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు.

ఈ నెల 15న ప్రారంభమైన పుష్కరాలు 26తో ముగియనున్నాయి. పుష్కరాలకు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో భక్తులు (Devotees) భారీగా తరలివస్తున్నారు. త్రివేణి సంగమం వద్ద సరస్వతి నది(Saraswati River)లో పుణ్యస్నానాలు ఆచరించి కాళేశ్వరంలోని ముక్తేశ్వర స్వామి(Mukteswara Swamy)ని దర్శించుకుంటున్నారు.

గురువారం ఒకరోజే లక్ష మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అలాగే శుక్రవారం లక్షకుపైగా భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా వర్షాలతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఇప్పటికే పలువురు మంత్రులు, ప్రముఖులు పుణ్యస్నానాలు ఆచరించారు.