Homeభక్తిArunachalam Temple | భక్తజన సంద్రంగా అరుణాచలం.. గిరిప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు

Arunachalam Temple | భక్తజన సంద్రంగా అరుణాచలం.. గిరిప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Arunachalam Temple | తమిళనాడులోని అరుణాచల క్షేత్రం(Arunachala Kshetram) భక్త జన సందర్భంగా మారింది. కొండచుట్టు భక్తులతో రద్దీ నెలకొంది. ఇసుక వేస్తే రాలనంత మంది జనం గిరి ప్రదక్షిణకు తరలివచ్చారు.

అరుణాచలంలో గిరి ప్రదక్షిణ(Giri Pradakshina)కు ఎంతో ప్రాముఖ్యత ఉన్న విషయం తెలిసిందే. దీంతో ప్రతి పౌర్ణమి సందర్భంగా వేలాది మంది భక్తులు(Devotees) అరుణాచలం క్షేత్రానికి తరలివచ్చి గిరి ప్రదక్షిణ చేస్తారు. 14 కిలో మీటర్ల మేర కొండ చుట్టూ తిరుగుతారు. అయితే గురువారం గురుపౌర్ణమి(Guru Purnima) సందర్భంగా లక్షలాది మంది భక్తులు అరుణాచల క్షేత్రానికి పోటెత్తారు. భక్తులతో ఆలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ప్రతి నెలా పౌర్ణమి రోజు భారీ ఎత్తున భక్తులు తరలివస్తారు. నేడు గురుపౌర్ణమి కావడంతో పోటెత్తారు.