అక్షరటుడే, వెబ్డెస్క్ : Saraswathi Pushkaralu | త్రివేణి సంగమమైన కాళేశ్వరం kaleshwaram వద్ద సరస్వతి నది పుష్కరాలు Saraswathi Pushkaralu ఘనంగా కొనసాగుతున్నాయి. ఏడు రోజులుగా కొనసాగుతున్న పుష్కరాలకు భక్తులు తరలివస్తున్నారు. బుధవారం ఉదయం నుంచే భారీ సంఖ్యలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. మంగళవారం నదిలో దాదాపు 50 వేల మంది పుణ్య స్నానాలు చేసి, కాళేశ్వరంలోని ముక్తేశ్వర స్వామి mukteswara swamyని దర్శించుకున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 26 వరకు పుష్కరాలు జరగనున్నాయి.
Saraswathi Pushkaralu | పెరగనున్న భక్తుల రద్దీ
కాళేశ్వరం వద్ద గోదావరి godavari, ప్రాణహిత pranahitha, సరస్వతి saraswathi నదులు ఒకచోట కలుస్తాయి. అందుకే దీనిని త్రివేణి సంగమం అంటారు. ఇక్కడ సరస్వతి నది అంతర్వాహినిగా కలుస్తుంది. అంతర్వాహిని అయిన సరస్వతి నదికి గత వందేళ్లుగా కాళేశ్వరం వద్ద పుష్కరాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 26తో పుష్కరాలు ముగియనున్నాయి. దీంతో నేటి (బుధవారం) నుంచి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.