Homeభక్తిDevotees flock to Tirumala | తిరుమలకు పోటెత్తిన భక్తులు.. కొండపై ఇప్పటికే లక్ష దాటారు!

Devotees flock to Tirumala | తిరుమలకు పోటెత్తిన భక్తులు.. కొండపై ఇప్పటికే లక్ష దాటారు!

అక్షరటుడే, తిరుమల: Devotees flock to Tirumala | ఇల వైకుంఠ పురం తిరుమల Tirumala కు భక్తులు పోటెత్తారు. కొండపైకి ఇప్పటికే లక్షకు పైగా భక్తులు చేరుకున్నారు.

ప్రస్తుతం సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కొండపైకి భారీగా భక్తులు వస్తుండటంతో ఈ సమయం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

ఈ రోజు సాయంత్రం గరుడ వాహన Garuda Vahana సేవ ఉంది. ఈ నేపథ్యంలో ఈ వేడుకను 2 లక్షల మంది వీక్షించేలా టీటీడీ TTD ఏర్పాట్లు చేస్తోంది.

శ్రీవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలిరావడంతో టీటీడీ భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసింది. 5 వేల మంది భద్రతా సిబ్బందితో నిఘా పెట్టింది.

Devotees flock to Tirumala | నిమిషానికో ఆర్టీసీ బస్సు..

ప్రయాణానికి ఇబ్బందులు తలెత్తకుండా తిరుపతి – తిరుమల మధ్య నిమిషానికో ఆర్టీసీ బస్సు నడుస్తోంది.  దాదాపు రెండున్నర లక్షల మంది ప్రయాణించేలా చర్యలు తీసుకున్నారు.

ఇక నిన్న శ్రీవారిని 75,006 మంది భక్తులు దర్శించుకున్నారు. వేంకటేశ్వర స్వామికి 45,413 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ. 3.36 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.

Must Read
Related News