అక్షరటుడే, వెబ్డెస్క్ : Traffic Jam | కాళేశ్వరం(Kaleshwaram) త్రివేణి సంగమం వద్ద కొనసాగుతున్న సరస్వతి పుష్కరాల(Saraswathi Pushkaralu)కు భక్తులు పోటెత్తారు. రేపటితో పుష్కరాలు ముగియనుండటంతో పుణ్యస్నానాలు చేయడానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో భూపాలపల్లి(Bhupalapalli) నుంచి కాళేశ్వరం మార్గంలో 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఏర్పాట్లు సరిగ్గా లేకపోవడంతో వాహనాలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది.
Traffic Jam | అడవిలోకి మళ్లించడంతో..
పుష్కరాలకు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో పోలీసులు వాహనాలను అడవి మార్గంలోకి మళ్లించారు. అనాలోచితంగా వాహనాలు మళ్లించడంతో ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించడంతో ఐదు గంటలుగా భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ పునరుద్ధరణకు పోలీసులు, అధికారులు చర్యలు చేపడుతున్నారు. అయితే పోలీసుల వైఫల్యంతోనే ట్రాఫిక్ జామ్(Traffic Jam) అయిందని భక్తులు ఆరోపిస్తున్నారు.