అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sabarimala Temple | శబరిమల ఆలయం తెరుచుకోవడంతో అయ్యప్ప స్వామి (Lord Ayyappa) దర్శనానికి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. సోమవారం నుంచి భక్తులను దర్శనానికి అనునమతిస్తున్నారు. అయితే భక్తులు భారీగా తరలి వస్తుండటం.. అందుకు తగినట్లు ఏర్పాట్లు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తున్నాయి.
శబరిమలకు అయ్యప్ప స్వాములు, భక్తులు తరలి వస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయడంతో ఆలయ నిర్వాహకులు, ప్రభుత్వం విఫలం అయ్యాయి. తాగినంత పోలీసులను మోహరించలేదు. భక్తుల (devotees) రద్దీని నియంత్రించడానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. వచ్చిన వారిని వచ్చినట్లు క్యూలైన్లలో పంపిస్తున్నారు. దీంతో స్వామి దర్శనానికి గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఆహారం, మంచి నీరు (food and clean water) అందించే వారు కరువయ్యారు. రద్దీ అధికంగా ఉండటంతో లైన్లలో ఉన్న చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం ఓ వృద్ధురాలు క్యూలైన్లో ఊపిరాడక మృతి చెందింది.
Sabarimala Temple | తెలుగు భక్తులకు అవమానం
అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లిన తెలుగు భక్తులకు అవమానం జరిగింది. అక్కడ ఏర్పాట్లు సక్రమంగా చేయని అధికారులు, పోలీసులు భక్తులతో దురుసుగా ప్రవర్తిస్తారు. రద్దీని నియంత్రించడంలో విఫలమైన పోలీసులు భక్తులను అవమానించారు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari district) స్వాములు స్వామి దర్శనానికి వెళ్లారు. క్యూలైన్ ఎక్కడ అని అడిగినందుకు ఓ కేరళ పోలీస్ అధికారి జిప్ ఓపెన్ చేసి అసభ్యకరంగా సైగలు చేశాడంటూ వారు ఆరోపించారు. వారు ఆందోళనకు దిగడంతో ఆ అధికారిని ఆలయ సిబ్బంది సైలెంట్‌గా పక్కకు పంపించేశారని స్వాములు చెబుతున్నారు. కాగా ఈ ఘటనపై ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) ఆగ్రహం వ్యక్తం చేశారు. శబరిమలలో తెలుగువాళ్లకి ఒక కోఆర్డినేటర్‌ని నియమించాలని రెండు రాష్ట్రాల సీఎంలను ఆయన కోరారు. స్వాములతో అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Sabarimala Temple | హైకోర్టు ఆగ్రహం
శబరిమలలో భక్తుల రద్దీపై కేరళ హైకోర్టు (Kerala High Court) ఆందోళన వ్యక్తం చేసింది. ఇంత మంది భక్తులు వస్తారని తెలిసి, సరైన ఏర్పాట్లు ఎందుకు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలయం తెరిచిన 48 గంటల్లో 2 లక్షల మంది శబరిమలకు వచ్చారని కోర్టు తెలిపింది. భక్తులను అలా హడావిడిగా లోపలికి, బయటకు ఎందుకు పంపుతున్నారని ప్రశ్నించింది. ఒక్క నిమిషంలో 80 మందిని దర్శనానికి ఎలా అనుమతిస్తారని మండి పడింది. ఆరు నెలల ముందు నుంచే భక్తుల కోసం ఏర్పాట్లు ఎందుకు చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
