అక్షరటుడే, మెండోరా: Karthika Masam | కార్తీకమాసం సందర్భంగా పవిత్రమైన కార్తీక స్నానాలు చేసేందుకు భక్తులు గోదావరికి పోటెత్తారు. ఈ పవిత్రమాసంలో రెండో సోమవారం సందర్భంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (Sriramsagar Project) వద్ద గోదావరి (Godawari) తీరాలు భక్తులతో కిటకిటలాడాయి.
Karthika Masam | తెల్లవారుజాము నుంచే..
తెల్లవారు జామున నుంచే భక్తులు గోదావరి స్నానాల కోసం తరలివచ్చారు. అనంతరం కార్తీక దీపాలను గోదావరిలో వదిలి తమ మొక్కులు తీర్చుకున్నారు. గోమాతలకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి తీరమంతా భక్తిమయంగా మారింది.
Karthika Masam | జాగ్రత్తలు పాటించాలి.. ఎస్సై సుహాసిని
ఈ సందర్భంగా ఎస్సై సుహాసిని మాట్లాడుతూ.. గోదావరి వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నందున భక్తులు జాగ్రత్తలు పాటించాలన్నారు. నదిలోకి దిగే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర స్థితిలో మెండోరా పోలీసులను సంప్రదించాలని కోరారు.


