అక్షరటుడే, ఇందల్వాయి : Indalwai | మండల కేంద్రంలోని దేవిఘడ్ దేవితండా సేవాలాల్ ఆలయ బ్రహ్మోత్సవాలు (Sevalal Temple Brahmotsavam) భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చండీయాగం, యజ్ఞం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలకు శుక్రవారం టీఎస్ ఆర్టీసీ మాజీ ఛైర్మన్, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ (Bajireddy Govardhan) హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయ వార్షికోత్సవాల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి పూజారులు హాజరయ్యారు. అనంతరం.. ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను దేవితండా (Devithanda) నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎంపీపీ రమేశ్ నాయక్, మందిరం పూజారి దేగావత్ శివరాం రాజ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిలువేరి దాస్, మాజీ జడ్పీటీసీ గోపాల్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు ప్రకాశ్, సీనియర్ నాయకులు పాశం కుమార్, రఘు తదితరులు పాల్గొన్నారు.