HomeUncategorizedMLA Thota Laxmi Kantharao| అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలి

MLA Thota Laxmi Kantharao| అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలి

- Advertisement -

అక్షరటుడే, బిచ్కుంద: MLA Thota Laxmi Kantharao| నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కార్యకర్తలకు సూచించారు. మంగళవారం బిచ్కుంద ఏఎంసీ కార్యాలయంలో పార్టీ మండల నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు (Government schemes) అందేలా చూడాలన్నారు.

ఇప్పటివరకు రూ.5.33 కోట్ల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు (CMRF checks) పంపిణీ చేశామని, 300పైగా మందికి ఎల్‌వోసీలు జారీ చేశామన్నారు. జుక్కల్‌ నియోజకవర్గాన్ని (Jukkal constituency) రాష్ట్రంలో నెంబర్​ వన్​గా తీర్చిదిద్దుతానన్నారు. నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు.