Homeజిల్లాలునిజామాబాద్​Collector Nizamabad | అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయాలి

Collector Nizamabad | అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయాలి

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | జిల్లాలో ఆయా శాఖల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను తక్షణమే ప్రారంభించి శరవేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి(Collector Vinay Krishna Reddy) అధికారులకు ఆదేశించారు.

ఈ మేరకు మంగళవారం అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్​లతో కలిసి ఇందిరమ్మ ఇల్లు (Indiramma Housing Scheme), డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల అసంపూర్తి పనులు (Double bedroom houses), ఇతర పెండింగ్​లో ఉన్న అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేనాటికి సాధ్యమైనంత వరకు పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు.

అర్బన్ ప్రాంతాల్లో పెండింగ్​లో ఉన్న రెండు పడక గదుల ఇళ్ల సదుపాయాల కల్పన పనులను పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ కనెక్షన్లు, మంచినీటి సరఫరా, రోడ్లు, డ్రెయినేజీ తదితర మౌలిక సదుపాయాల పనులను తొందరగా పూర్తి చేయాలన్నారు. అలాగే అసంపూర్తిగా ఉన్న ఆరోగ్య ఉపకేంద్రాలు, అంగన్​వాడీ నిర్మాణాలు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు సమీక్షలు జెడ్పీ సీఈవో సాయ గౌడ్, హౌసింగ్ పీడీ పవన్ కుమార్, డీపీఓ శ్రీనివాస్, డీఎంహెచ్​వో రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News