అక్షరటుడే , భీమ్గల్ : Bheemgal | గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన పాలకవర్గాలతో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ (MPDO Gangula Santosh Kumar) పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. బుధవారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో (local Mandal Parishad office) సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఎంపీడీవో మాట్లాడుతూ.. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సర్పంచులు, వార్డు సభ్యులకు తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంపై (Telangana Panchayat Raj Act) పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు మధ్య సత్సంబంధాలు ఉన్నప్పుడే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.
Bheemgal | పనుల పురోగతిపై ఆరా
గ్రామాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులపై ఎంపీడీవో సమీక్షించారు. ఇళ్ల నిర్మాణ ప్రగతిని పర్యవేక్షిస్తూ, లబ్ధిదారులకు అవసరమైన సూచనలు చేయాలన్నారు. పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదని ఆదేశించారు. ఉపాధి హామీ పనుల లక్ష్యాలను చేరుకోవాలని, నర్సరీల్లో మొక్కల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. గ్రామ పంచాయతీలకు ప్రధాన వనరులైన ఇంటి పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని కార్యదర్శులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంపీవో జావీద్, ఏపీవో నర్సయ్య, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.