అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Telangana University | తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరద బట్టు వేణురాజ్ (NSUI State General Secretary Varada Battu Venuraj) పేర్కొన్నారు. నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
విశ్వవిద్యాలయానికి ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేసిన సందర్భంగా పటాకులు కాల్చి సంబురాలు నిర్వహించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కలగానే మిగిలిన ఇంజినీరింగ్ కళాశాల కాంగ్రెస్ పాలనలో సాధ్యమైందన్నారు. కళాశాల సాధనలో జిల్లాలోని ప్రతిముఖ్య నాయకుడి పాత్ర ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు నవీన్, రమేష్, నరేందర్ సింగ్, సాయికిరణ్, కౌశిక్, మణి, రాజు పాల్గొన్నారు.