అక్షర టుడే, డిచ్‌పల్లి: MLA Bhupathi Reddy | రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి (Rural MLA Bhupathi Reddy) అన్నారు.
డిచ్‌పల్లి మండలంలోని (Dichpalli mandal) కమలాపూర్‌కు చెందిన బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పలువురు ఎమ్మెల్యే సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మ్మెల్యే మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో (local body elections) కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు కంచెట్టి గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, సొసైటీ ఛైర్మన్ రాంచందర్ గౌడ్, గ్రామ అధ్యక్షుడు గొల్ల గోపాల్, మాజీ ఉపసర్పంచ్ ఆశారెడ్డి, ఆలయ కమిటీ ఛైర్మన్ రాజేందర్, డీసీసీ డైరెక్టర్ ఎన్ రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.