అక్షర టుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | గ్రామ పంచాయతీలకు పూర్తిస్థాయిలో అధికారం ఇచ్చినప్పుడే అభివృద్ధి సాధ్యమని ఉర్దూ అకాడమీ రాష్ట్ర ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్ (aher Bin Hamdan) అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన అధ్యక్షుడు గంగాధర్ గౌడ్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హాజరై మాట్లాడుతూ.. రాజీవ్‌గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ అనేది రాజీవ్ గాంధీ తీసుకున్న ఒక సృజనాత్మక నిర్ణయమని, కేంద్రం నుంచి నిధులను నేరుగా గ్రామాలకు, మున్సిపాలిటీలకు (villages and municipalities) అందించినప్పుడే దేశంలో అభివృద్ధి జరుగుతుందన్నారు.
ఆర్టికల్ 72, 73 రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకే హక్కులు కల్పించిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని గుర్తు చేశారు. మహాత్మా గాంధీ, రాజీవ్‌గాంధీ స్ఫూర్తితో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన కార్యక్రమాన్ని గ్రామస్థాయిలో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. తద్వారా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ శేఖర్‌గౌడ్, ఆర్‌జీపీఆర్‌ఎస్ రాష్ట్ర ఇన్‌ఛార్జి సుభాష్, జోనల్ ఇన్‌ఛార్జి నవీన్, వర్ని ఏఎంసీ చైర్మన్ సురేష్ బాబా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.