అక్షరటుడే ఇందల్వాయి: Mla Bhupathi reddy | కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని కేఎన్ఆర్ గార్డెన్లో (KNR Garden) శుక్రవారం లబ్ధిదారులకు రేషన్ కార్డులను (Ration Cards) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్లలో లబ్ధిదారులకు ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు.
Mla Bhupathi reddy | కాళేశ్వరం పేరుతో రూ.కోట్లు దోచుకున్నారు..
కల్వకుంట్ల కుటుంబం (Kalvakuntla family) కాళేశ్వరం (Kaleshwaram) పేరుతో కోట్ల రూపాయలు దోచుకుందని ఎమ్మెల్యే ఆరోపించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని (Cm revanth reddy) విమర్శించే స్థాయి కేటీఆర్‌కు (KTR) లేదన్నారు. మండలంలో వివిధ గ్రామాలకు చెందిన 3,200 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందించినట్లు వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వెళ్తున్నామన్నారు.
Mla Bhupathi reddy | రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ
రాష్ట్రంలో ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం 40 లక్షల రేషన్‌కార్డులను మంజూరు చేసిందని భూపతి రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి తన ధ్యేయమని కార్యకర్తల కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తహశీల్దార్ తదితరులు పాల్గొన్నారు.