Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అభివృద్ధి నిరంతర ప్రక్రియ

Nizamabad City | కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అభివృద్ధి నిరంతర ప్రక్రియ

కాంగ్రెస్‌ ప్రభుత్వం నిజామాబాద్​ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ అన్నారు. నగరంలో రూ.22.69 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: Nizamabad City | రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ (government advisor Shabbir Ali) అన్నారు. నిజామాబాద్‌ నగరంలో గురువారం రూ.22.69 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్ (TPCC President Mahesh Kumar Goud), అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తాతో (MLA Dhanpal Suryanarayana Gupta) కలిసి పనులు ప్రారంభించారు.

ముందుగా గౌతమ్‌ నగర్, ఉర్దూ పాఠశాల సమీపంలో రూ.346 కోట్లతో స్టార్మ్‌ వాటర్‌ డ్రెయిన్‌ పనులకు శంకుస్థాపన చేసారు. ఎల్లమ్మగుట్టలో రూ.1.19 కోట్లతో సీసీ రోడ్డు పనులు (CC road works) ప్రారంభించారు. అలాగే, న్యాల్‌కల్‌ రోడ్‌లో రూ.3.46 కోట్లతో స్టార్మ్‌ వాటర్‌ డ్రెయిన్‌ సీసీ రోడ్డు పనులు, మాలపల్లిలో రూ.37 లక్షలతో ఉర్దూ మీడియం బాలికల కళాశాల అభివృద్ధి పనులు, రూ.2.24 కోట్లతో ధర్మపురి హిల్స్‌ స్టార్మ్‌ వాటర్‌ డ్రెయిన్‌ పనులు, హబీబ్‌నగర్‌లో రూ.1.39 కోట్లతో స్టార్మ్‌ వాటర్‌ డ్రెయిన్‌ పనులు, నిజాంకాలనీలో తీన్‌కమాన్‌ వద్ద రూ.4.40 కోట్లతో స్టార్మ్‌ వాటర్‌ డ్రెయిన్‌ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అంటే అభివృద్ధికి మారుపేరు అన్నారు. పదేళ్లలో నిజామాబాద్‌ నగరం (Nizamabad city) అభివృద్ధికి నోచుకోలేదని, తమ ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రూ. 23 కోట్ల నుడా నిధులతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. మహేష్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. జిల్లాకు ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌ కళాశాలలు తెచ్చామని, నిజామాబాద్‌ నగరంలో స్థలం సేకరించి ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ త్వరలో నిర్మిస్తున్నామన్నారు.