అక్షరటుడే, ఇందల్వాయి: Suppose Christmas | అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఎమ్మెల్యే భూపతిరెడ్డి (MLA Bhupathi Reddy) అన్నారు. ధర్పల్లి మండల కేంద్రంలోని (Dharpally mandal) ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు హాజరయ్యారు.
Suppose Christmas | ప్రతిపేద కుటుంబానికి న్యాయం..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి చేరుతున్నాయన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు స్కిల్ యూనివర్సిటీ (Skill University) ఏర్పాటు చేసి, వృత్తిపరమైన నైపుణ్యాభివృద్ధి కోర్సులు ప్రవేశపెట్టామని తెలిపారు. కాంగ్రెస్ బడుగు, బలహీన వర్గాల పార్టీ అని, దేశంలోని అన్ని కులాలు, మతాలను సమానంగా చూస్తుందని పేర్కొన్నారు. క్రిస్టియన్ మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసి రూ.20 వేల కోట్ల నిధులు కేటాయించిందని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావడం లేదని విమర్శించారు.
Suppose Christmas | స్వాతంత్య్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్
దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ (Congress party) అని, అన్ని మతాలను సామరస్యంగా చూస్తూ సమాజంలోని ప్రతివర్గం అభివృద్ధికి కృషి చేస్తుందని పేర్కొన్నారు. రూరల్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన క్రిస్టియన్ల కోసం కమ్యూనిటీ హాళ్లను కేటాయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే సమాధుల కోసం స్థలం కావాలన్న అభ్యర్థనపై స్పందించిన ఎమ్మెల్యే, త్వరలో ప్రభుత్వ భూమిని కేటాయిస్తామని భరోసా ఇచ్చారు.
Suppose Christmas | మహిళలకు వడ్డీలేని రుణం..
మహిళల కోసం వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత రేషన్ బియ్యం, కొత్త రేషన్ కార్డులు, ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం భారీ కేక్‌ను కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజేందర్, వివిధ మండలాల తహశీల్దార్లు, ఎంపీడీవోలు, ధర్పల్లి సర్పంచ్ చెలిమెలి శ్రీనివాస్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బాలరాజ్, సీనియర్ నాయకులు, క్రిస్టియన్ మైనార్టీ నాయకులు, ఫాదర్లు, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు.