Homeఆంధప్రదేశ్Devaragattu Bunny Festival | దేవరగట్టు బన్నియాత్రలో మళ్లీ రక్తపాతం .. కర్రల సమరంలో ఇద్దరు...

Devaragattu Bunny Festival | దేవరగట్టు బన్నియాత్రలో మళ్లీ రక్తపాతం .. కర్రల సమరంలో ఇద్దరు మృతి, 78 మందికి గాయాలు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Devaragattu Bunny Festival | ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు Kurnool జిల్లా దేవరగట్టులో మాల మల్లేశ్వరస్వామి దసరా బన్నియాత్ర Mala Malleswara Swamy Dussehra Banni Yatra మరోసారి రక్తమోడింది.

ఏటా విజయదశమి రోజున జరిగే ఈ ఉత్సవం ఈసారి కూడా హింసాత్మకంగా ముగిసింది. భక్తుల మధ్య చోటుచేసుకున్న కర్రల పోరులో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా.. మరో 78 మంది తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడినవారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ, వర్గీయ పోరుకి అడ్డుకట్ట వేయలేకపోయారు.

అర్ధరాత్రి స్వామి – అమ్మవారి కల్యాణోత్సవం అనంతరం, దేవతా మూర్తుల ఊరేగింపు సమయంలో వివాదం చెలరేగింది.

Devaragattu Bunny Festival | భయానక దృశ్యాలు

మూర్తులను తమ గ్రామానికి తీసుకెళ్లాలన్న ఆకాంక్షతో నెరణికి, కొత్తపేట, నెరణికితండా గ్రామాల భక్తులు ఒకవైపు… అరికెర, సుళువాయి, బిలేహాల్ తదితర గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో దాడులు చేసుకున్నారు.

ఊరేగింపులో పాల్గొన్న వర్గాలు ఒకరిపై ఒకరు కర్రలతో విరుచుకుపడటంతో మైదానం యుద్ధభూమిగా మారింది. బాధితులను ఆలూరు, ఆదోని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

అయితే పలువురు భక్తులు గాయాలపాలైనా, పసుపు పూసుకుని చికిత్స తీసుకోకుండా స్వగ్రామాలకు వెళ్లిపోయారు. దేవరగట్టులో Devaragattu 800 అడుగుల ఎత్తైన కొండపై వెలసిన మాల మల్లేశ్వరస్వామి ఆలయంలో జరిగే బన్నియాత్రకు ఏటా దసరా పర్వదినాన ప్రత్యేక స్థానం ఉంటుంది.

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరిగే ఈ జైత్రయాత్రలో కర్రల సమరం అనాదిగా కొనసాగుతోంది. ఈ ఉత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు పరిసర గ్రామాల నుంచే కాక విదేశాల నుంచి కూడా పర్యాటకులు, మీడియా ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ ఘటనపై స్పందించిన స్థానిక అధికారులు, పోలీసులు Police ముందస్తు నిషేధాజ్ఞలు, ప్రజల్లో అవగాహన కల్పించినప్పటికీ, పురాతన సంప్రదాయంగా ఉన్న ఈ కర్రల సమరాన్ని నియంత్రించడంలో విఫలమయ్యారని విశ్లేషకులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులు పేర్కొన్నారు.