ePaper
More
    HomeతెలంగాణPeddapalli Bypass | ఇంజిన్​ మార్చడం కోసం ఆగిన రైలు.. బైపాస్ లైన్​​ అందుబాటులోకి వస్తే...

    Peddapalli Bypass | ఇంజిన్​ మార్చడం కోసం ఆగిన రైలు.. బైపాస్ లైన్​​ అందుబాటులోకి వస్తే తప్పనున్న తిప్పలు

    Published on

    అక్షరటుడే, వెబ్​బెస్క్ : Peddapalli Bypass | నాందేడ్​–తిరుపతి వీక్లీ ఎక్స్​ప్రెస్​ పెద్దపల్లి జంక్షన్​ మీదుగా రాకపోకలు సాగిస్తోంది. నిజామాబాద్​, బాసర మీదుగా ఈ రైలు వెళ్తుంది. అయితే ఈ ట్రెయిన్​ తిరుపతి నుంచి నాందేడ్​ వెళ్లే సమయంలో పెద్దపల్లి జంక్షన్(Peddapalli Junction)​లో ఇంజిన్​ మార్చుకోవాల్సి ఉంటుంది.

    పెద్దపల్లి జంక్షన్​లో ఇంజిన్​ రివర్స్​(Engine Reverse) తీసుకువస్తారు. దీనికోసం దాదాపు 45 నిమిషాల సమయం పడుతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం పెద్దపల్లి జంక్షన్​ ప్లాట్​ఫారం –3 మీద ఇంజిన్​ మార్చుకోవడం కోసం రైలును నిలిపివేశారు. దీంతో సమయం వృథా అవుతంది. అదే పెద్దపల్లి బైపాస్(Peddapalli Bypass)​ రైల్వేలైన్​ అందుబాటులోకి వస్తే ఈ బాధలు తప్పనున్నాయి.

    Peddapalli Bypass | పనులు పూర్తయినా..

    పెద్దపల్లి రైల్వే బైపాస్​ లైన్​ పూర్తయింది. ప్రస్తుతం గూడ్స్​ రైళ్లు(Goods Trains) ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే ప్రయాణికుల రైళ్లను కూడా ఇదే మార్గంలో పంపిస్తే ఇంజిన్​ మార్చే సమస్య ఉండదు. దీంతో ఎంతో సమయం ఆదా అవుతుంది. అయితే బైపాస్​ లైన్​లో రైల్వే స్టేషన్​ నిర్మాణం చేపట్టిన తర్వాత ఈ మార్గంలో సాధారణ రైళ్లను అనుమతించనున్నట్లు తెలిసింది.

    పెద్దపల్లి బైపాస్​ లైన్​ ఎంతో కీలకం. ఉత్తర, దక్షిణ భారత దేశాలను కలిపే కాజీపేట–బల్లార్షా మార్గంలో నిత్యం వందలాది రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఈ క్రమంలో రైళ్ల రద్దీని దృష్టిలో ఉంచుకొని పెద్దపల్లి బైపాస్​ లైన్​ నిర్మించారు. అలాగే కాజీపేట–బల్లార్షా మధ్య మూడో ట్రాక్​ నిర్మాణం కూడా చేపట్టారు. త్వరలో అది కూడా అందుబాటులోకి రానుంది. అలాగే నాలుగో లైన్​ నిర్మాణం కోసం అధికారులు ప్రతిపాదనలు పంపారు. అయితే పెద్దపల్లి రైల్వే బైపాస్​ నుంచి నాందేడ్​–తిరుపతి రైలును పంపిస్తే ఇంజిన్​ మార్పు కోసం ఆగాల్సిన అవసరం ఉండదని, దీంతో ప్రయాణికుల సమయం ఆదా అవుతుంది.

    Latest articles

    Vikran Engineering IPO | రేపటినుంచి మరో ఐపీవో

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vikran Engineering IPO | వివిధ రంగాలలో ఈపీసీ సేవలందిస్తున్న విక్రాన్‌ ఇంజినీరింగ్‌ కంపెనీ...

    KTR | స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్​ఎస్​ జెండా ఎగరాలి..

    అక్షరటుడే, బాన్సువాడ: KTR | స్థానిక సంస్థల ఎన్నికల్లో(Local Body Elections) బీఆర్​ఎస్​ జెండా ఎగరాలని మాజీ మంత్రి,...

    KGF Villain | చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం.. కేజీఎఫ్ విల‌న్ హ‌ఠాన్మ‌ర‌ణం..

    అక్షరటుడే, వెబ్​డెస్క్: KGF Villain | ఇటీవ‌ల చిత్ర ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన ప‌లువురు ప్ర‌ముఖుల మ‌ర‌ణ వార్త‌లు ఎక్కువ‌గా...

    Parineeti Chopra | గుడ్ న్యూస్ చెప్పిన ప‌రిణీతి చోప్రా.. బేబి ఆన్ ది వే అంటూ పోస్ట్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Parineeti Chopra | బాలీవుడ్ బెస్ట్‌ సెలబ్రిటీ జంటల పేర్లు చెప్పుకుంటే అందులో తప్పకుండా...

    More like this